క్రీడాభూమి

ఆసీస్‌కు టి-20 సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివరి మ్యాచ్‌లో ఓడిన సౌతాఫ్రికా

కేప్‌టౌన్, మార్చి 10: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. చెరి ఒక విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో, కీలకంగా మారిన చివరి, మూడో మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచినా అతని శ్రమ వృథా అయింది. సమష్టిగా కృషి చేస్తే, ఎవరూ భారీగా స్కోర్లు చేయకపోయినా విజయం సాధ్యమవుతుందని ఆస్ట్రేలియా నిరూపించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. ఆమ్లా శతకానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోవాల్సి వచ్చింది. డేవిడ్ మిల్లర్ 30, క్వింటన్ డికాక్ 25 చొప్పున పరుగులు చేశారు. సిరీస్‌ను గెల్చుకోవాలంటే 179 పరుగులు చేయాల్సిన ఆస్ట్రేలియా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే, 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించి సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఉస్మాన్ ఖాజా 33, షేన్ వాట్సన్ 42, స్టీవెన్ స్మిత్ 44, డేవిడ్ వార్నర్ 33 చొప్పున పరుగులు సాధించారు. చివరిలో గ్లేన్ మాక్స్‌వెల్ 19, మిచెల్ మార్ష్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.