జాతీయ వార్తలు

దక్షిణ చైనా సముద్రంలో తలదూర్చవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది సమస్యను మరింత జటిలం చేస్తుంది
అమెరికా, భారత్‌లకు చైనా పరోక్ష హెచ్చరిక
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: దక్షిణ చైనా సముద్రం విషయంలో తలదూర్చవద్దని ఈ ప్రాంతానికి వెలుపల ఉన్న దేశాలను చైనా శనివారం హెచ్చరించడమే కాకుండా కయ్యానికి కాలు దువ్వడం ప్రాంతీయ సుస్థిరతకు ఎంతమాత్రం మంచిది కాదని స్పష్టం చేసింది.‘బయటి వారు, ఈ సమస్యలతో ఎలాంటి సంబంధం లేని దేశాలు ఈ విషయాల్లో తలదూర్చకూడదు. దీనివల్ల సమస్య మరింత జటిలం అవుతుంది’ అని మన దేశంలో చైనా రాయబారి లీ యుచెంగ్ పరోక్షంగా అమెరికా, భారత్‌లనుద్దేశించి అన్నారు. ‘ఆసియా పసిఫిక్ కంట్రీ: ఇండియా అండ్ బిగ్ పవర్ ఎంగేజ్‌మెంట్’ అనే అంశంలో శనివారం డెక్కన్ హెరాల్డ్ పత్రిక ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో మాట్లాడుతూ ఆయన ఈ హెచ్చరిక చేసారు. అయితే ఆయన వాదనను బిజెపి నాయకుడు రామ్ మాధవ్ తిప్పి కొడుతూ, స్వేచ్ఛా నౌకా వాణిజ్యం అవసరమని వాదించారు. హిందూమహాసముద్రం ఒక్క భారత్‌కే చెందినది కాదని, ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా దీన్ని పంచుకుంటున్నాయని, దక్షిణ చైనా సముద్రం విషయంలో కూడా అదే వర్తిస్తుందని ఆయన అన్నారు. ఈ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థను చైనా ఎలా ముందుకు పరుగులుతీయించిందో ఈ ప్రాంతంలో శాంతిని కూడా అది అదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు. ఈ ప్రాంతాన్ని ఆసియా- పసిఫిక్ ప్రాంతం అని కాక ఇండో- పసిఫిక్ ప్రాంతం అని వ్యవహరించాలని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు.
దక్షిణ చైనా సముద్రంలో నౌకా రవాణా స్వేచ్ఛ ఉండాలని గట్టిగా కోరుతున్న మన దేశం ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుతుండడమే కాకుండా హైడ్రోకార్బన్ నిల్వలు పుష్కలంగా ఉన్న ఈ సముద్రంలోమన దేశానికి ఆర్థిక ప్రయోజనాలుకూడా ఉన్నాయి. అయితే వివాదాస్పదంగా మారిన ఈ ప్రాంతంలోని దీవులు తమవేనన్న చైనా వాదనను లీ పునరుద్గాటిస్తూ రెండో అపపంచ యుద్దం తర్వాత చైనా జపాన్‌నుంచి ఈ దీవులను తిరిగ తన అధీనంలోకి తెచ్చుకుందని చెప్పారు. అంతేకాకుండా 1970 వరకు కూడా ఏ దఏశమూ ఈ దీవులు తమవని చెప్పలేదని కూడా ఆయన అన్నారు. ఈ ప్రాంతానికి చెందని దఏవాలు కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. ప్రాంతీయ భద్రతకు ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఈ ప్రాంతంలో శాంతికి,ఉమ్మడి ఉముద్ర జలాలకు చైనా కట్టుబడి ఉంది’ అని ఆయన చెప్పారు.
చర్చలకు చైనా సిద్ధంగా ఉందని దక్షిణ చైనా సముద్రంలో ప్రవర్తనకు సంబంధించిన డిక్లరేషన్‌పై ఆసియాన్ దేశాలతో కలిసి ఇప్పటికే సంతకం చేసిందని లీ చెప్పారు. కాగా, ఈ శతాబ్దాన్ని ‘ఆసియా- పసిఫిక్ శతాబ్దం’గా పేర్కొనడం సరిగ్గా సరిపోతుందని, ఎందుకంటే, చైనా, భారత్‌లే కాకుండా రాబోయే దశాబ్దాల్లో అన్ని రంగాల్లో ప్రపంచంపై ఆధిపత్యం సాధించగల ఇతర దేశాలు ఈ ప్రాంతంలో ఉన్నాయని డెక్కన్ హెరాల్డ్ ఎడిటర్ ఇన్ చీఫ్ తిలక్ కుమార్ అన్నారు.