రంగారెడ్డి

మహిళలకు జిల్లా పోలీసుల అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగారెడ్డి జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి
వికారాబాద్, డిసెంబర్ 10: మహిళలకు రంగారెడ్డి జిల్లా పోలసులు తోడుగా, మద్దతుగా ఉంటారని రంగారెడ్డి జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి భరోసా ఇచ్చారు. గురువారం మహిళలపై వేధింపులు ఆగాలని 16 రోజుల పాటు జిల్లాలో నిర్వహించిన క్యాంపెయిన్ ముగింపు కార్యక్రమాన్ని వికారాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో స్థానిక చిగుళ్ళపల్లి మైదానంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ తాండూర్‌లో ప్రారంభించిన క్యాంపెయిన్‌ను రెండు వారాలుగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ళు, మహిళలు పనిచేసే చిన్నతరహా, కుటీర పరిశ్రమలకు వెళ్ళి భద్రత గురించి సూనచలు, సలహాలు ఇచ్చామని చెప్పారు. వేధింపులు జరిగితే పోలీసులను ఎలా ఆశ్రయించాలి, ఎలా సహాయం పొందాలనే విషయాలను వివరించామని పేర్కొన్నారు. విద్య జీవితానికి తప్పనిసరి, ఎలా ప్రవర్తిస్తే భవిష్యత్ అలా ఉంటుందని సూచించారు. ప్రతి అమ్మాయి ఏదో ఒక స్థాయిలో వేధింపులకు గురవుతున్నారని, క్యాంపెయిన్ విషయంతో తమ అభిప్రాయాలను తెలియజెప్పాలని అన్నారు. మహిళలు భయపడే అవసరం లేదని తెలిపారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వికారాబాద్ సబ్‌కలెక్టర్ డాక్టర్ అళహు వర్షిణి మాట్లాడుతూ తప్పుడు మార్గంలో వెళితే ఇబ్బందులు తప్పవని సూచించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఐఎఎస్ అయ్యానని చెప్పారు. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ అమ్మాయిలతో పాటు తల్లిదండ్రులు, సోదరులతో సమావేశం ఏర్పాటు చేస్తే మహిళలపై వేధింపులు, ఇతర సమస్యలపై కూలంకషంగా చర్చించవచ్చని సూచించారు. తల్లిదండ్రుల గారం పిల్లలను చెడు అలవాట్లవైపు తిప్పుతున్నాయని అన్నారు. వ్యవసనం అనేది శాడిజానికి దారితీస్తోందని పేర్కొన్నారు. శ్రవణం కన్నా దృశ్యం ప్రమాదకరమైదన్నారు. మహిళలపై దాడులు జరిగితే తప్పించుకునే ట్రిక్స్ నేర్చుకోవడం అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ గొప్ప మానవులు, మనుషులు కావాలని పిలుపునిచ్చారు. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి బి.ఐలయ్య మాట్లాడుతూ రక్తపాతం కనిపించకుండా మానసికంగా హింసించినా హింసే అవుతుందని అన్నారు.
మానవుడికి ఉన్న హక్కులన్నీ స్ర్తిలకు వర్తిస్తాయని తెలిపారు. తరతరాలుగా స్ర్తిని రెండో శ్రేణిగా చూడటం సరైంది కాదన్నారు. చరిత్ర తిరగరాసేది స్ర్తి అని పేర్కొన్నారు. రాచరికపు కాలం నుండి స్ర్తిని భోగవస్తువుగా చూడటంతోనే, 21వ శతాబ్దంలో స్ర్తిని తక్కువ చూస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్.వెంకటస్వామి, వికారాబాద్, ఎఆర్ డిఎస్పీలు టి.స్వామి, ఎ.లక్ష్మినారాయణ, వికారాబాద్ మహిళా పోలిస్‌స్టేషన్ సిఐ నిర్మల, సిఐ జి.రవి, ఎస్‌ఐలు రేణుకారెడ్డి, పి.రవీందర్‌లు పాలల్గొన్నారు. అంతకుముందు వివిధ కళాశాల విద్యార్థులు ర్యాలీగా మైదానానికి చేరుకున్నారు.