క్రీడాభూమి

ప్రపంచ మహిళా బాక్సింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కోమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ) ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీ లకు భారత స్టార్ మేరీ కోమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించ నుంది. 33 ఏళ్ల కోమ్ ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌గా నిలి చింది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందుకుంది. అయతే, ఈఏడాది రియో డి జెనీరోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించ లేకపోయంది. ఈ అనూహ్య పరిణామంతో ఆవేదనకు గురైన కోమ్‌కు ఎఐబిఎ ప్రకటన ఊరటిస్తున్నది. ఇది తనకు లభించిన అరుదైన అవ కాశమని, మహిళా బాక్సింగ్ పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఉపయోగపడుతుందని కోమ్ వ్యాఖ్యానించింది. తనకు అప్ప చెప్పిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేసింది.