క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ క్వార్టర్స్‌కు సెరెనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 1: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ క్వార్టర్ ఫైనల్స్ చేరింది. వర్షం కారణంగా పలుమార్లు వాయిదా పడిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఆమె 18వ సీడ్ ఎలినా స్విటోలినాను 6-1, 6-1 తేడాతో చిత్తుచేసి, కెరీర్‌లో 22వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించే దిశగా మరో అడుగు ముందుకేసింది. అయితే, ఆమె సోదరి వీనస్ విలియమ్స్ ప్రీ క్వార్టర్స్ నుంచే వెనుదిరిగింది. వీనస్‌ను తిమియా బాస్కిన్‌స్కీ 6-2, 6-4 ఆధిక్యంతో ఓడించి క్వార్టర్స్ చేరింది. కికీ బెర్టెన్స్ 7-6, 6-3 స్కోరుతో మాడిసన్ కీస్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది.
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ కూడా క్వార్టర్స్ చేరాడు. ఇప్పటి వరకూ కెరీర్‌లో ఫ్రెంచ్ ఓపెన్‌ను సాధించలేకపోయిన అతను ఈసారి టైటిల్‌పై కనే్నశాడు. నాలుగో రౌండ్‌లో ‘జెయింట్ కిల్లర్’ రాబర్టొ బటిస్టా అగుట్‌ను 3-6, 6-4, 6-1, 7-5 తేడాతో ఓడించి, టైటిల్ అందుకునే అవకాశాలను మెరుగుపరచుకున్నాడు. కాగా, డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రిన్కా 6-2, 6-1 ఆధిక్యంతో అల్బర్ట్ రామోస్ వినోలాస్‌పై విజయం సాధించాడు. గోఫిన్ 4-6, 6-2, 6-2, 6-3 తేడాతో గల్బిస్‌పై గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు.