క్రీడాభూమి

మేరీ కోమ్‌కు వైల్డ్‌కార్డ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 1: ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న 33 ఏళ్ల భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్‌కు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఇటీవల ఖజకస్తాన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 51 కిలోల విభాగంలో కోమ్ పోటీపడింది. అంతకు ముందు క్వాలిఫయింగ్ ఈవెంట్స్‌లో విఫలమైన ఆమె చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. కనీసం సెమీ ఫైనల్‌కు కూడా చేరకపోవడంతో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించే అవకాశాలను ఆమె కోల్పోయింది. అయితే, ఆమెకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇప్పించాలని అఖిల భారత బాక్సింగ్ సంఘం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒలింపిక్స్‌లో 51, 60, 75 కిలోల విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఈ మూడు విభాగాల్లో కలిపి ఒకే ఒక వైల్డ్‌కార్డ్ ఎంట్రీని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అనుమతిస్తుంది. ఆ అవకాశాన్ని కోమ్ కోసం ఉపయోగించుకోవాలని ఎఐబిఎ నిర్ణయించినట్టు సమాచారం. అయితే, నేరుగా ఐఒఎతో చర్చించే లేదా పేర్లు పంపించే అవకాశం భారత బాక్సింగ్ సంఘానికి ఉండదు. అందుకే, భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) ద్వారా కోమ్ పేరును వైల్డ్‌కార్డ్‌కు పంపేందుకు ఎఐబిఎ అధికారులు కృషి చేస్తున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన కోమ్ ఈఏడాది ఆగస్టు 5 నుంచి రియో డి జెనీరోలో ప్రారంభమయ్యే ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శనతో రాణిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సహజంగా జాతీయ క్రీడా సంఘాలు లేదా సమాఖ్యలు చేసిన ప్రతిపాదనలను ఐఒఎ యథాతథంగా ఆమోదిస్తుంది. కాబట్టి కోమ్‌కు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తున్నది.