ఆంధ్రప్రదేశ్‌

మున్ముందు మరింత సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 7: విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటంతోనే సరిపెట్టదని, మున్ముందు మరింతగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధ్రీశ్వరి ఉద్ఘాటించారు. బిజెపి ఫ్లోర్ లీడర్‌తో కలిసి విశాఖలో బుధవారం విలేఖరులతో ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా పదం వాడకుండా, అంతకు రెట్టింపు సాయం అందించేందుకు ఎన్‌డిఏ ప్రభుత్వం విస్తృత కసరత్తు చేసిందన్నారు.
రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు ప్రత్యేక హోదాకు ఎంతమాత్రం ఆస్కారం లేకుండా ఉన్నాయని, ఈ తరుణంలో హోదా ప్రకటించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడే సాహసం కేంద్ర ప్రభుత్వం చేయలేదన్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హోదావల్ల వచ్చే ప్రయోజనాలకు మించి లబ్ధి చేకూరేలా కేంద్ర కసరత్తు చేస్తోందన్నారు. విభజన బిల్లులో ఉన్నవాటిని పరిష్కరిస్తూనే లేనివాటిని ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రానికి కేటాయిస్తోందన్నారు. దీనిలో భాగంగానే నితిన్ గడ్కరీ రాష్ట్రంలో 65వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రకటించారన్నారు.
ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు వంటివి రాష్ట్ర ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలని, వీటి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో పలు సందర్భాల్లో చర్చించినట్టు చెప్పారు.
సెంటిమెంట్ బలంగా ఉన్న అంశాల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని అధిష్ఠానాన్ని అభ్యర్థించామన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా విజయవాడ కేంద్రంగా జోన్ ప్రకటిస్తామంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించేందుకు నిరాకరించారు. విభజన హామీలో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ వస్తుందని, అది ఎక్కడన్నది కేంద్రం ప్రకటిస్తుందంటూ తప్పించుకున్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి జాతీయ మహిళా మోర్చా
అధ్యక్షురాలు పురంధ్రీశ్వరి