క్రీడాభూమి

చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీకి టీమిండియా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓవల్, మే 27: ‘మినీ వరల్డ్ కప్’ చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌కు డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా సిద్ధమైంది. జూన్ ఒకటి నుంచి మెయిన్ డ్రాలో మ్యాచ్‌లు ఆరంభం కానుండగా, ఈలోగా భారత్ రెండు వామప్ మ్యాచ్‌లు ఆడుతుంది. వాటిలో మొదటి మ్యాచ్ ఆదివారం న్యూజిలాండ్‌తో జరుగుతుంది. 30న జరిగే రెండో వామప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీ కొంటుంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు అటు సీనియర్లు, ఇటు యువ ఆటగాళ్లతో సమతూకంగా ఉంది. 2013లో జరిగిన టోర్నీని కైవసం చేసుకున్న భారత్, ఆతర్వాత కాలంలో మరింత బలపడింది. వనే్డ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాన్ని సంపాదించింది. బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. జట్టులోని మిగతా ఆటగాళ్ల విషయం ఎలావున్నా, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిట్నెస్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గాయం కారణంగా అతను ఇటీవలు ముగిసిన ఐపిఎల్ టోర్నీలో ఆడలేకపోయాడు. అతను ఎంత వరకు కోలుకున్నాడనేది కివీస్‌తో జరిగే వామప్ మ్యాచ్‌లో స్పష్టమవుతుంది. అదే విధంగా పేసర్ మహమ్మద్ షమీ ఫిట్నెస్‌పై నెలకొన్న అనుమానాలకు కూడా ఈ మ్యాచ్‌తో తెరపడుతుంది. మార్టిన్ గుప్టిల్, కేన్ విలియమ్‌సన్, టామ్ లాథమ్ వంటి మేటి బ్యాట్స్‌మెన్‌కు బౌల్ చేయడం ద్వారా టోర్నమెంట్‌లో రాణించడానికి వారు వామప్ మ్యాచ్‌ల్లో పునాది వేసుకోవచ్చు. ఐపిఎల్‌లో విఫలమైన కెప్టెన్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ తదితరుల బ్యాటింగ్ తిరిగి గాడిలో పడేందుకు కూడా ఈ మ్యాచ్ ఉపయోగపడుతుంది.