క్రీడాభూమి

యువ భారత్ సాధించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోట్చెఫ్‌స్ట్రూమ్, ఫిబ్రవరి 8: అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగే ఫైనల్‌లో యువ భారత జట్టు బంగ్లాదేశ్‌తో ఢీకొననుం ది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి, పా యంట్ల పట్టికలో ముందు వరుసలో నిలిచిం ది. బంగ్లాదేశ్ సైతం ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించగా, పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయంది.
ఇదిలాఉంటే యశస్వీ జైస్వాల్, దివ్యాన్ సక్సేనా, ప్రియామ్ గార్గ్, రవి బిష్ణోయ, కార్తీక్ త్యాగీ వంటి ఆటగాళ్లతో భారత జట్టు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. నేడు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే భారత్ మొత్తం ఐదు సార్లు అండర్- 19 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా నిలవనుంది. గతంలో 2000 (మహ్మద్ కైఫ్), 2008 (విరాట్ కోహ్లీ), 2012 (ఉన్ముక్త్‌చంద్), 2018 (పృథ్వీ షా) ప్రపంచకప్‌ను సాధించి, ప్రస్తుతం భారత్ కానుక అన్ని మ్యాచుల్లో రాణించినట్టుగానే నేడు జరిగే ఫైనల్ మ్యాచ్ లోనూ రాణిస్తే కెప్టెన్ ప్రియామ్ గార్గ్ ప్రపంచకప్ అందించిన కెప్టెన్ల జాబితాలో చోటు దక్కించుకోనున్నాడు.