క్రీడాభూమి

ఇదేం అత్యుత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోచెఫ్‌స్ట్రూమ్, ఫిబ్రవరి 10: భారత్ అండర్-19 జట్టుపై వరల్డ్ కప్ మ్యాచ్‌లో విజయం సాధించిన బంగ్లాదేశ్ మితిమీరిన స్థాయిలో ఉత్సవాలు జరుపుకోవడం పట్ల భారత టీమ్ మేనేజర్ అనిల్ పటేల్ మండిపడ్డారు. బంగ్లా వ్యవహారాల శైలిని ఐసీసీ తీవ్రంగా పరిగణిస్తోందని, ఆట చివరి క్షణంలో చోటుచేసుకున్న పరిణామాల పుటేజీని సమీక్షిస్తోందని ఆయన తెలిపాడు. భారత్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన బంగ్లా ఆటగాళ్లు కొందరు అత్యంత అభ్యంతరకర రీతిలో వ్యవహరించారు. విజయం సాధించడంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ కొందరి ఆటగాళ్ల పాత్ర మాత్రం గర్హనీయంగా ఉందని అన్నాడు. టీవీ పుటేజీలను చూసిన తర్వాత ఐసీసీ తీసుకునే నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన తెలిపాడు. ఆట ముగిసిన వెంటనే విజయం సాధించిన బంగ్లా జట్టు మైదానం అంతా పరిగెడుతూ అసహ్య రీతిలో వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. దాదాపుగా ఇరు దేశాల జట్లు కొట్టుకునే పరిస్థితి తలెత్తింది. అయితే, అక్కడున్న అధికారులు, కోచింగ్ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మ్యాచ్ రిఫరీ గ్రామీ లాబ్రూరుూ తనను కలుసుకుని జరిగిన పరిణామాల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడని భారత జట్టు మేనేజర్ అనిల్ పటేల్ అన్నారు.