తెలంగాణ

ఎన్‌కౌంటర్‌పై స్పందనలు.. ప్రతి స్పందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దిశ హత్యోదోంతం నిందితుల ఎన్ కౌంటర్ చేయడంపై ఒకవైపు హర్షాతీరేఖాలు వ్యక్తం అవుతుండగా.. మరోవైపు అదే సందర్భంలో ఈ ఘటనపై నిరసనలు..ఖండించేవారు లేకపోలేదు. విద్యార్థినులు, మహిళలు, తల్లిదండ్రులు పోలీసులను అభినందిస్తూ ప్రకటనలు సైతం చేస్తున్నారు. వారికి జిందాబాద్‌లు కొడుతున్నారు. కొంతమంది ఏకంగా వారిపై పూలజల్లు సైతం కురిపించారు. ముఖ్యంగా మహిళలు పోలీసులకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఘటనా స్థలం నుంచి బస్సుల్లో వేళ్లే విద్యార్థినులు, మహిళలు కేరింతలు కొడుతూ పోలీసులకు జిందాబాద్‌లు కొట్టారు. కేవలం మహిళల నుంచే స్పందనలు వచ్చాయనుకుంటే పొరపాటు. యువకులు, పురుషులు, వృద్ధులు కూడా పోలీసులకు జిందాబాద్‌లు కొట్టారు. కొంతమంది సామాన్యులు ఒక అడుగు ముందుకు వేసి పటాకులు పేల్చుతూ.. స్వీట్లు పంచిపెట్టారు. పోలీసులు ప్రజల రక్షణ కోసం స్పందించేందుకు పెట్టిన 100 డయల్‌కు సైతం ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతున్నారంటే ఈ ఘటనలో రక్షకభటులు తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ ఆమోద ముద్ర వేసినట్లేనని భావిస్తున్నారు. రాజకీయ నాయకులే కాదు సినీ సెలబ్రిటీలు సైతం పోలీసులను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు సైతం పెడుతున్నారు. మానవ హక్కుల సంఘాలు ఈ ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ వివిధ రకాల స్పందనలు.. ప్రతి స్పందనలు ఇలా ఉన్నాయి..
బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి ప్రశంసించారు. మహిళలను వేధించే కామాంధులకు ఇదో గుణపాఠమని, నిందితులు అదే ప్రాంతంలో చావడం వల్ల దిశ ఆత్మశాంతిస్తుందన్నారు. ఈ మేరకు ఆమె తన అభిప్రాయాన్ని హిందీలో ట్వీట్ చేశారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో న్యాయం జరిగిందని కథా రచయిత కోన వెంకట్,సినీనటుడు అల్లు అర్జున్,విశాల్, భారత బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు. ‘దిశ’ ఉదంతం కనువిప్పు కావాలని, బహిరంగ శిక్షలు అమలు చేయాలని జనసేన అధినేత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సినీ నటులు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. దేవుడే పోలీసుల రూపంలో దిశ నిందితులను శిక్షించాడని పేర్కొన్నారు.చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఈ ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. సజ్జనార్‌ టీమ్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని ఆయన అన్నారు. 'న్యాయం జరిగింది' అని రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు. అలాంటి నేరగాళ్లు మతం, సంస్కృతికి మాయని మచ్చ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మంచు లక్ష్మీ, విజయశాంతి, ఏఆర్ మురుగుదాస్, అక్కినేని నాగార్జున, అఖిల్, మంచు మనోజ్, జూనియర్ ఎన్టీయార్, నాని, రాశిఖన్నా, పూరీ జగన్నాథ్ తదితరులు పోలీసుల చర్యను సమర్థిస్తూ ట్వీట్ చేశారు.

సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ స్పందిస్తూ,ఇది కచ్చితంగా హర్షించతగ్గ పరిణామం కాదు. మహిళలు, వారి రక్షణ పేరు చెప్పి ఇలా ఎన్ కౌంటర్లు చేయడం సమంజసం కాదన్నారు. ఎన్‌కౌంటర్ చేసినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోతాయా? అని షట్లర్ గుత్తా జ్వాలా ప్రశ్నించారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించారు. నేరానికి మరో నేరం పరిష్కారం కాదని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం .. చట్టానికి లోబడి శిక్షించాలని ట్వీట్ చేశారు.