జాతీయ వార్తలు

ప్రత్యేక హోదాపై స్తంభించిన పార్లమెంటు ఉభయసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై మంగళవారం పార్లమెంటు ఉభయ సభలు కొద్ది సేపు స్తంభించిపోయాయి. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏ.పి.తోపాటు తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి గందరగోళం సృష్టించారు. సభ నుండి సస్పెండ్ చేస్తానని ఉపాధ్యక్షుడు కురియన్ పలుమార్లు బెధిరించినా కాంగ్రెస్ సభ్యులు ఎంత మాత్రం వెనకడుగు వేయకుండా ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టారు. ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని వాధించిన బి.జె.పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తప్పించుకు తరుగుతోందంటూ కాంగ్రెస్ సభ్యులు ఎదురు దాడి చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ చేయటంతో రాజ్యసభ ఓక సారి వాయిదా పడింది. లోకసభలో కాంగ్రెస పక్షం సభ్యులు ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సభ నుండి వాకౌట్ చేశారు.