రాష్ట్రీయం

సికింద్రాబాద్‌నుంచి ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: ప్రయాణికుల అధిక రద్దీని నియంత్రించేందుకు గాను సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్, సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నెం.02285 సికింద్రాబాద్--యశ్వంత్‌పూర్ సువిధా సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు జనవరి 17న రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయానికి యశ్వంత్‌పూర్ చేరుకుంటుందని రైల్వే తెలిపింది. అలాగే తిరుగుప్రయాణంలో నెం.02286 యశ్వంత్‌పూర్-సికింద్రాబాద్ సువిధా సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు జనవరి 18న రాత్రి 22.40 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి తర్వాత రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ నెం.07427 రైలు సికింద్రాబాద్ నుంచి డిసెంబర్ 29, జనవరి 5న బయలుదేరి తర్వాత రోజు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నెం.07328 రైలు డిసెంబర్ 30, జనవరి 6వ తేదీల్లో కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి తర్వాత రోజు సికింద్రాబాద్ చేరుకుంటుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.