ఆటాపోటీ

వీరేనా మేటి స్పిన్నర్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్‌లో బౌలింగ్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది స్పిన్. ప్రపంచానికి స్పిన్ బౌలింగ్ బలాన్ని పరిచయం చేసిన ఘనత భారత్‌కే దక్కుతుంది. ఎంతో మంది మేటి స్పిన్నర్లను మన దేశం క్రికెట్‌కు అందించింది. 1970 దశకంలో ఎర్రాపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్, బిషన్ సింగ్ బేడీ భారత స్పిన్ సామర్థ్యాన్ని టెస్టు క్రికెట్ ఆడే దేశాలకు రుచి చూపించారు. వీరిని ఎదుర్కోవడానికి మేటి బ్యాట్స్‌మెన్ కూడా భయపడేవారు. దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకున్న వెంటనే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రాలను దేశ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ స్పిన్నర్లుగా మీడియా ముద్ర వేయడం విచిత్రం. వీరి సామర్థ్యాన్ని శంకించడానికి విల్లేకపోయనా, వీరిని అత్యుత్తమ స్పిన్నర్లుగా పేర్కోవడం ఎంతో మంది ప్రఖ్యాత స్పిన్నర్లను అవమానించినట్టే అవుతుంది. విదేశాల్లోనూ సత్తా చాటిన ఎంతో మంది నాటి స్పిన్నర్లను తక్కువ అంచనా వేయడం సరికాదు.
================

ప్రపంచ నంబర్ వన్ టెస్టు జట్టు దక్షిణాఫ్రికాను విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా చిత్తు చేసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో వర్షం కారణంగా నాలుగు రోజుల ఆట రద్దయింది. ఫలితంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. మిగతా మూడు మ్యాచ్‌ల్లో భారత్ విజయభేరి మోగించింది. సిరీస్‌ను కైవసం చేసుకుంది. 31 వికెట్లు పడగొట్టిన టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. ఈ సిరీస్‌కు ఎంపికైన అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రాలను మేటి స్పిన్నర్లుగా అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. క్రికెట్ పట్ల అవగహన ఉన్నవారు, గత తరం స్పిన్నర్ల గురించి తెలిసిన వారు ఈ ధోరణిని వ్యతిరేకిస్తున్నారు. అశ్విన్ బృందం సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదుగానీ, వారు మాత్రమే ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్లనడం అర్థరహితం.
రకరకాలైన మాధ్యమాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈ స్పిన్ త్రయానికి మన దేశం గతంలో ఎన్నడూ చూడని అసాధారణ బౌలర్లనే ముద్ర సులభంగానే పడింది. దక్షిణాఫ్రికాను టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో ఓడించడంలో అశ్విన్ బృందం కీలక పాత్ర పోషించిందన్న విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ, మన దేశ టెస్టు క్రికెట్ చరిత్రలో వీరిని అత్యుత్తమ స్పిన్నర్లుగా పేర్కోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వీరూ ప్రతిభావంతులే.. కానీ, వీరు మాత్రమే ప్రతిభావంతులు అనడం తప్పు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ దూకుడుకు అశ్విన్ సమర్థంగా కళ్లెం వేశాడు. అంతమాత్రం చేత అతనిని దేశ చరిత్రలోనే ఉత్తమ స్పిన్నర్ అనడంలో అర్థం లేదు. నేటి తరానికి తెలిసినా, తెలియకపోయినా, ఎర్రాపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్, బిషన్ సింగ్ బేడీను మించి స్పిన్నర్లు చాలా అరుదుగా ఉంటారన్నది విశే్లషకుల అభిప్రాయం. చరిత్ర కూడా ఇదే మాట చెప్తుంది.
ఒక బౌలర్ లేదా బ్యాట్స్‌మన్ సామర్థ్యాన్ని లెక్కించేటప్పుడు, ఇతరులతో పోల్చేటప్పుడు అనేకాకనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. పిచ్ తీరు నుంచి మొదలుపెడితే, ప్రత్యర్థి జట్ల బలాబలాల వరకూ ప్రతి అంశంపై తులనాత్మక విశే్లషణ జరగాలి. క్లెయివ్ లాయిడ్, గార్డెన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్, వివియన్ రిచర్డ్స్, అల్విన్ కాళీచరణ్, బ్రియాన్ లారా బ్యాట్స్‌మెన్‌తో కూడిన ఒకప్పటి వెస్టిండీస్‌తో నేటి జట్టును పోల్చడం సరికాదు. వెస్టిండీస్‌ను ఓడించే విషయం ఎలావున్నా విండీస్‌తో సిరీస్ అంటేనే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లు కూడా భయంతో వణికిపోయేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చిన్నచిన్న జట్లు కూడా విండీస్‌తో ఆటాడుకుంటున్నాయి. ఒకప్పుడు బ్యాటింగ్ దిగ్గజాలను సైతం భయపెట్టిన చార్లెస్ గ్రిఫిత్, వెస్లీ హాల్, జోల్ గార్నర్, మైఖేల్ హోల్డింగ్స్, మాల్కం మార్షల్, కర్ట్‌లీ అంబ్రోస్, కోట్నీ వాల్ష్‌తో పోల్చగల బౌలర్లు ఇప్పటి విండీస్ జట్టులో కాగడాపెట్టి వెతికినా కనిపించరు. ఒక్కోసారి ఒక్కో జట్టు అసాధారణ ప్రతిభతో వెలిగిపోవడం, క్రమంగా మసకబారడడం సహజం. అందుకే, పిచ్ స్వభావం ఎలావున్నా, ప్రత్యర్థి ఎవరైనా వెనుకడుగు వేయకుండా నిలకడగా ఆడే వారినే సమర్థులంటారు. ఆ సామర్థ్యం ఉన్న అసాధారణ క్రికెటర్లకు చరిత్ర పుటల్లో శాశ్వత స్థానం లభిస్తుంది. మన దేశంలో బౌలింగ్ విభాగానికి వస్తే కపిల్ దేవ్ పేరును ప్రస్తావించకుండా అడుగు ముందుకు వేయలేం. స్పిన్నర్ల గురించి చెప్పాలంటే ప్రసన్న, చంద్రశేఖర్, బేడీ పేర్లను ముందు స్మరించుకోవాలి. వారి తర్వాతే ఎవరైనా. ఈ స్పిన్ త్రయం కంటే మెరుగైన బౌలింగ్ విశే్లషణలు నమోదు చేసిన, ఎక్కువ వికెట్లు సాధించిన స్పిన్నర్లు లేకపోలేదు. కానీ, ఆ ముగ్గురూ ఆడిన రోజులను, అప్పట్లో పిచ్‌ల తీరును పరిగణలోకి తీసుకుంటే, వారినే ఉత్తమ స్పిన్నర్లుగా చెప్పుకోవాలి. పైగా, దేశంలో ఒక రకంగా, విదేశాల్లో మరోరకంగా వారు బౌలింగ్ చేయలేదు. మన దేశంలో చెలరేగిపోయి, విదేశాల్లో చేతులెత్తేసే చాలా మంది బౌలర్లతో పోలిస్తే ప్రసన్న, చంద్రశేఖర్, బేడీ ప్రతిభ అసాధారణం. ఆతర్వాత చెప్పుకోదగ్గ స్పిన్నర్లలో అనీల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ ఉన్నారు. కుంబ్లే 132 టెస్టులు ఆడి, 40,850 బంతులు వేసి, 18,355 పరుగులిచ్చి 619 వికెట్లు కూల్చాడు. భజ్జీ 103 మ్యాచ్‌లు ఆడి, 28,580 బంతులు బౌల్ చేసి, 13,537 పరుగులిచ్చి 417 వికెట్లు సాధించాడు. అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్లలో వీరిద్దరూ మొదటి రెండు స్థానాలను ఆక్రమిస్తారు. ‘ఎవర్ గ్రేట్’ స్పిన్నర్ల జాబితాలో వీరినీ చేర్చాలి. అశ్విన్, జడేజా, మిశ్రా అసమర్థులని ఎవరూ అనరు. వారి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయరు. నిలకడగా రాణించలేరంటూ వారిని కించపరచరు. అయితే, గతాన్ని తెలుసుకోకుండా, దేశానికి అత్యుత్తమ సేవలు అందించిన వారిని పట్టించుకోకుండా ఈ ముగ్గురే ఇప్పటి వరకూ మన దేశ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్లంటూ ముద్ర వేయడాన్ని మాత్రం వ్యతిరేకించక తప్పదు.
పేరొందిన భారత స్పిన్నర్ల బలాబలాలు..
1. అనీల్ కుంబ్లే (132 టెస్టులు) 619 వికెట్లు, 2. హర్భజన్ సింగ్ (103 టెస్టులు) 417 వికెట్లు, 3. బిషన్ సింగ్ బేడీ (67 టెస్టులు) 266 వికెట్లు, 4. భగవత్ చంద్రశేఖర్ (58 టెస్టులు) 242 వికెట్లు, 5. ఎర్రాపల్లి ప్రసన్న (49 టెస్టులు) 189 వికెట్లు, 6. రవిచంద్రన్ అశ్విన్ (32 టెస్టులు) 176 వికెట్లు, 7. వెంకట రాఘవన్ (57 టెస్టులు) 156 వికెట్లు, 8. దులీప్ దోషి (33 టెస్టులు) 114 వికెట్లు, 9. వెంటపతి రాజు (28 టెస్టులు) 93 వికెట్లు, 10. బాపూ నాద్కర్ణి (41 టెస్టులు) 88 వికెట్లు, 11. రవీంద్ర జడేజా (16 టెస్టులు) 68 వికెట్లు, 12. నరేంద్ర హీర్వాణీ (17 టెస్టులు) 66 వికెట్లు, అమిత్ మిశ్రా (18 టెస్టులు) 66 వికెట్లు, 13. రాజేష్ చౌహాన్ (21 టెస్టులు) 47 వికెట్లు.

- ఎస్‌ఎంఎస్