మెయిన్ ఫీచర్

సామాన్యుడే స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజు రోజుకు విస్తరిస్తున్న సోషల్‌మీడియాలో బ్లాగర్స్ కూడా కొత్త కొత్త విషయాలను ప్రజలకు చేరువ చేయాలని తహతహలాడుతున్నారు. ఓ మంచి జీవిత కథ చదివితే కలిగించే స్ఫూర్తి, ఆనందం మాటల్లో వర్ణించలేం. వీటి కోసం పుస్తకాలే కొనక్కర్లేదు. సోషల్ మీడియాలో మీకోసం తెలుగులో ఎన్నో కథలు రెడీగా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒఆ్యజళఒ్యచి ష్య్యౄౄశ్ఘౄశ.జశ బ్లాగ్ ఓపెన్ చేస్తే చాలు జీవిత కథలు ఎన్నో మీ ముందు ప్రత్యక్షమవుతాయి. నేటి యువతరం మార్గనిర్దేశం లేక మానసిక దుర్బలత్వంతో సమస్యల వలయంలో కూరుకుపోతుంది. ఇటువంటి సమయంలో వీరు చాటింగ్‌లతో కాలాన్ని వృధాచేయకుండా ఆన్‌లైన్‌ల్లో ఎన్నో బ్లాగులు జీవిత కథలను అందిస్తున్నాయి. ఇవి చదివి స్ఫూర్తిపొంది మార్గనిర్దేశం చేసుకోవచ్చు. యువప్రాయంలో సరైన మార్గనిర్దేశం లేకపోతే దారితప్పుతారు. నేటి యువతరానికి సరైన మార్గనిర్దేశం చేయాలం టే సామాన్య వ్యక్తుల స్ఫూర్తిదాయకమైన కథలు అవసరం. ఇదే ఆలోచనతో హైదరాబాద్ కు చెందిన శక్తి స్వరూప్ వేలాది రూపాయలు జీతం వచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి సామాజిక చైతన్యానికి తను వంతు ప్రయత్నం అందించేందుకు స్టోరీస్‌ఆఫ్‌కామన్‌మ్యాన్ బ్లాగును ఓపెన్ చేశాడు. ఈ బ్లాగు నిర్వహణకు ఐదుగురు వలంటీర్లు (ఫ్రీలాన్స్ రైటర్స్) స్వచ్ఛందంగా ముందుకు రావటం విశేషం. వీరు హైదరాబాద్, చెన్నై, బెంగళూ రు కేంద్రాలుగా పనిచేస్తున్నారు. ఈ వలంటీర్లు బ్లాగులో స్ఫూర్తినిచ్చే జీవిత కథలను సేకరించి రాస్తారు. ఈ కథలు చదివిన వారు తప్పకుండా కుంగుబాటు నుంచి బయటపడతారని శక్తి స్వరూ ప్ అంటారు. ఈ కథలు చదివిన తరువాత పాఠకులు తమ విలువైన అభిప్రాయాలను చెప్పటానికి వీలు కల్పించారు.
75ఏళ్ల వృద్ధుడే స్ఫూర్తి..
వేలాది రూపాయల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదులుకుని ఎందుకు ఈ బ్లాగు నిర్వహిస్తున్నారని అడిగితే..‘‘ ఓ రోజు నేను రోడ్డు మీద వెళుతుంటే 75 సంవత్సరాల వృద్ధుడు కొబ్బరి కాయలు అమ్ముతున్నాడు. ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేదు. అయినప్పటికీ ఆయన కొబ్బరి కాయలను అమ్మటం మానలేదు. కొబ్బరి నీళ్లు తాగుతూ ఆయన చెప్పిన జీవిత కథ నన్ను కదలించింది. అలా స్ఫూర్తిదాయకమై సామాన్య వ్యక్తుల జీవిత కథలతో బ్లాగు ఏర్పాటుచేయాలనే ఆలోచన వచ్చింది. తొలుత ఆయన కథతోనే బ్లాగు ప్రారంభించాను’’. అని శక్తి స్వరూప్ అంటారు. సమాజంలో విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. వారినందర్నీ ఆకట్టుకోవాలంటే స్ఫూర్తినిచ్చే జీవిత కథలు కూడా విభిన్నం గా ఉండాలి. నేడు సమాజంలో మానసిక కుంగుబాటు అనేకమంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తుం ది. ఇలాంటివారికి సోషల్ మీడి యా ద్వారా స్ఫూర్తిదాయకమైన జీవిత పాఠాలను కథల రూపంలో బోధిస్తే దారితప్పరు. సమాజంలో ఈ చర్య ఎంతో మార్పు తెస్తుంది. 24 ఏళ్ల శక్తి స్వరూప్ కూడా దీనే్న నమ్మి ఆచరణలో పెట్టాడు.
హిందూ యూనివర్శిటీ నుంచి ఆహ్వానం
ఈ బ్లాగులో ప్రచురించే స్టోరీలు ఆసర వంటి పలు స్వచ్ఛంద సంస్థలు సైతం వినియోగించుకుంటున్నాయి. ఈ యువకుడు చేస్తున్న ప్రయత్నానికి అభినందిస్తూ ఓ మైక్రోసాఫ్ట్ కంపెనీ రెండు వేల డాలర్ల విలువ చేసే సాఫ్ట్‌వేర్ ఉచితంగా అందించింది. ఇప్పటి వరకు 150 సామాన్య మానవులకు చెందిన జీవిత కథలను ప్రచురించారు. ప్రసిద్ధిచెందిన బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి ఆహ్వా నం కూడా అందింది.
అక్కడి విద్యార్థులను ప్రోత్సహిస్తూ స్ఫూర్తిదాయకమైన కథలు చెబుతూ సాహి త్య పండుగలను నిర్వహించాల్సిందిగా యూనివర్శిటీవారు కోరారు. ఈ బ్లాగులో వస్తున్న స్టోరీలకు వస్తున్న ఆదరణ చూసి దీనికి సంబంధించి ఓ యాప్‌ను కూడా రూపొందించాడు. ఈ యాప్‌ను మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.

అన్నాహజారే..
ప్రసిద్ధ సామాజిక ఉద్యమ నేత అన్నాహజారే యువకుడిగా ఉన్నపుడు ఉద్యోగం రాక మానసికంగా కృంగిపోయాడు. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని ఇంటి నుంచి వచ్చారు. వస్తూ..వస్తూ దారిలో కనిపించిన పుస్తకాల షాపులో స్వామి వివేకానంద రాసిన పుస్తకం చదవి తన ప్రయత్నానికి తానే సిగ్గుపడి ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

చిత్రం:నేడు పెరుగుతున్న నెటిజన్లకు ప్రేరణ కలిగించటానికి, వారిలో ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసి నలుగురుకి అందించేందుకు ఈ బ్లాగును ఏర్పాటు చేశాను.
- శక్తి స్వరూప్