క్రీడాభూమి

ఆసీస్‌కు విండీస్ సవాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 2: గత మూడు టి-20 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకొని హ్యాట్రిక్ నమోదు చేసిన ఆస్ట్రేలియా మరోసారి విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. అయితే, ఆ జట్టుకు వెస్టిండీస్ నుంచి సవాళ్లు ఎదురుకానున్నాయి. 2009లో మొదలైన మహిళల టి-20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. అయితే, ఆతర్వాత ఆస్ట్రేలియా ఆధిపత్యం మొదలైంది. 2010లో న్యూజిలాండ్‌ను మూడు పరుగుల తేడాతో, 2012లో ఇంగ్లాండ్‌ను నాలుగు పరుగుల తేడాతో ఓడించిన ఆసీస్ టైటిల్ కైవసం చేసుకుంది. 2014లో ఇంగ్లాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించించి ఈ టోర్నీలో హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. నాలుగోసారి టైటిల్ సాధించేందుకు మెగ్ లానింగ్ నాయకత్వంలోని ఈ జట్టు దూసుకుపోతున్నది. అయితే, స్ట్ఫానీ టేలర్ కెప్టెన్సీలోని విండీస్ మొట్టమొదటిసారి ఈ టోర్నీలో ఫైనల్ చేరింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నది. పురుషుల విభాగంలోనూ విండీస్ ఫైనల్ చేరడంతో, ఆ జట్టుతోపాటు తాము కూడా గెలిచి అభిమానులకు డబుల్ ధమాకాను అందించాలన్నది టేలర్ బృందం ఆలోచన. కాగితంపై చూస్తే ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తున్నది. అన్ని విభాగాల్లోనూ ఆ జట్టు బలంగా ఉంది. అయితే, విండీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సమష్టి పోరాటానికి మారుపేరుగా నిలిచిన విండీస్ ఫైనల్‌లో గెలుస్తుందా లేదా అన్నది పక్కకుపెడితే, ఆస్ట్రేలియాకు గట్టిపోటీనివ్వడం ఖాయం.
మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలవుతుంది.

చిత్రం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో
మహిళల టి-20 వరల్డ్ కప్ ట్రోఫీతో వెస్టిండీస్ మహిళల జట్టు కెప్టెన్
స్ట్ఫానీ టేలర్, ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సారధి మెగ్ లానింగ్