బిజినెస్

అత్యంత జనసమ్మర్ద నగరాల్లో ముంబయి, కోట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాల జాబితాలో భారత్ నుంచి ముంబయి, కోట చోటు దక్కించుకున్నాయి. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ఈ జాబితాలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అగ్రస్థానంలో నిలిచినట్లు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) వెల్లడించింది. ఢాకాలో కిలోమీటర్‌కు 44,500 మంది జనసాంద్రత ఉందని, దీంతో ఆ నగరం అత్యంత జనసమ్మర్ధ నగరంగా నిలువగా, 31,700 మంది జనసాంద్రతతో భారత దేశ వాణిజ్య రాజధాని ముంబయి రెండో స్థానంలోనూ, 12,100 మంది జనసాంద్రతతో రాజస్థాన్‌లోని కోట ఏడో స్థానంలోనూ నిలిచాయి. కొలంబియాలోని మెడెలిన్ నగరం 19,700 మంది జనసాంద్రతతో ఈ జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకోగా, ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా (కిలోమీటర్‌కు 14,800 మంది) నాలుగో స్థానంలోనూ, మొరాకోలోని కాసాబ్లాంకా (కిలోమీటర్‌కు 14,200 మంది) ఐదో స్థానంలోనూ, నైజీరియాలోని లాగోస్ (కిలోమీటర్‌కు 13,300 మంది) ఆరో స్థానంలోనూ, సింగపూర్ (కిలోమీటర్‌కు 10,200 మంది) ఎనిమిదో స్థానంలోనూ, ఇండోనేషియా రాజధాని జకార్తా (కిలోమీటర్‌కు 9,600 మంది) తొమ్మిదో స్థానంలోనూ నిలిచాయి. ప్రజల్లో ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లో స్థిరపడటానికి వేర్వేరు కారణాలు ఉన్నప్పటికీ వీరిలో ఎక్కువ మంది ఉపాధి కోసమే పట్టణాల్లో స్థిరపడుతున్నారన్నది వాస్తమవని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని, 2050 నాటికి ఇది 66 శాతానికి పెరుగుతుందని, ప్రత్యేకించి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఇది 90 శాతానికి పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోందని డబ్ల్యుఇఎఫ్ తెలిపింది. కెన్యా రాజధాని నైరోబీకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో గల కిబెరా దుర్బర దారిద్య్రంలో మగ్గుతూ ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా ఉందని, అక్కడ రైల్వే లైన్లకు కొన్ని మిల్లీమీటర్ల దూరంలోనే జనావాసాలు ఉన్నాయని, అలాగే ముంబయిలోని ధారవిలో జనసాంద్రత చదరపు కిలోమీటర్‌కు 2 లక్షలుపైగా ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక పేర్కొంది.