క్రీడాభూమి

పోరాటం సాగిస్తా స్టార్ షట్లర్ పివి సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఏ స్థాయి టోర్నీల్లోనైనా అస్తశ్రస్త్రాలను పారవేసి వెనుదిరిగే ప్రసక్తే లేదని, కడవరకూ పోరాటాన్ని కొనసాగిస్తానని భారత స్టార్ షట్లర్ పివి సింధు వ్యాఖ్యానించింది. వచ్చేనెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)కు సిద్ధమవుతున్న ఆమె మంగళవారం ప్రాక్టీస్ అనంతరం పిటిఐతో మాట్లాడుతూ 15 పాయింట్ల ఫార్మెట్ కొంత కొత్తగా ఉన్నప్పటికీ, మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగేందుకు దోహదపడుతుందని తెలిపింది. తక్కువ పాయింట్లతో రౌండ్ పూర్తవుతుంది కాబట్టి, ఏ దశలోనూ వేగాన్ని తగ్గించే అవకాశం ఉందని చెప్పింది. మ్యాచ్ మొదలైన మరుక్షణం నుంచి చివరి వరకూ ప్రతి క్షణం సర్వశక్తులు ఒడ్డి ఆడక తప్పదని తెలిపింది. కొత్త విధానం వల్ల మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతాయని అన్నది. చెన్నై స్మాషర్స్ తరఫున సింధు బరిలోకి దిగనుంది. ఈ జట్టులో సోనీ ద్వి కున్కొరో, సిమోన్ సాంటోస్, ప్రణవ్ జెర్రీ చోప్రా, క్రిస్ అడ్‌కాక్ వంటి మేటి స్టార్లు ఉన్నారు. ఈ టోర్నీలో చెన్నై స్మాషర్స్‌తోపాటు ఢిల్లీ ఏసర్స్, హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు, టాప్ గన్స్, ముంబయి రాకెట్స్, అవధ్ వారియర్స్ జట్లు తలపడతాయి.