క్రీడాభూమి

బ్రేవో సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిడ్జిటౌన్, జూన్ 25: ముక్కోణపు వనే్డ సిరీస్‌లో చివరి ప్రిలిమినరీ మ్యాచ్‌ని గెల్చుకున్న వెస్టిండీస్ ఫైనల్‌కు చేరింది. దక్షిణాఫ్రికాను ఢీకొన్న ఈ జట్టు డారెన్ బ్రేవో అద్భుత శతకంతో రాణించడంతో 49.5 ఓవర్లలో 285 పరుగులు చేయగలిగింది. అనంతరం దక్షిణాఫ్రికాను కేవలం 185 పరుగులకే కట్టడి చేసి, 100 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. బార్బడాస్‌లో ఆదివారం జరిగే ఫైనల్‌లో ఈ జట్టు టైటిల్ కోసం ఆస్ట్రేలియాను ఢీ కొంటుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 12 పరుగుల వద్ద ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (4) వికెట్‌ను కోల్పోయింది. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రేవో క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడగా, టాప్ ఆర్డర్‌లో ఆండ్రె ఫ్లెచర్ (8), మార్లొన్ సామ్యూల్స్ (0), దనెష్ రాందీన్ (4) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కీరన్ పోలార్డ్‌తో కలిసి బ్రేవో స్కోరుబోర్డును ముందుకు దూకించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 156 పరుగులు జోడించారు. 71 బంతులు ఎదుర్కొన్న పొలార్డ్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేసి మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో ఫఫ్ డు ప్లెసిస్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. బ్రేవో 103 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 102 పరుగులు సాధించి, క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో డు ప్లెసిస్‌కు చిక్కాడు. జాసన్ హోల్డర్ (40), కార్లొస్ బ్రాత్‌వెయిట్ (33 నాటౌట్) చివరిలో విండీస్ స్కోరును పెంచడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇన్నింగ్స్ ముగియడానికి మరో బంతి మిగిలి ఉండగా, 285 పరుగుల స్కోరువద్ద విండీస్ ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాగిసో రబదా 31 పరుగులకు మూడు, క్రిస్ మోరిస్ 63 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు.
విండీస్‌ను ఓడించడానికి 286 పరుగులు సాధించాల్సిన దక్షిణాఫ్రికా ఆరంభం నుంచే తడబడింది. ఫర్హాన్ బెహర్డియన్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మోర్న్ మోర్కెల్ (32), ఇమ్రాన్ తాహిర్ (29), వేన్ పార్నెల్ (28) కొంత వరకూ జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించారు. మిగతా వారంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో దక్షిణాఫ్రికా 46 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైంది. విండీస్ బౌలర్లు షానన్ గాబ్రియెల్, సునీల్ నారైన్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. కార్లొస్ బ్రాత్‌వెయిట్‌కు రెండు వికెట్లు లభించాయి. ఇలావుంటే, ఇప్పటికే ఫైనల్‌లో స్థానం సంపాదించిన ఆస్ట్రేలి యాను ఈ టోర్నీలో హాట్ ఫేవరిట్‌గా పరిశీలకులు పేర్కొంటున్నారు.

సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: 49 ఓవర్లలో 285 ఆలౌట్ (డారెన్ బ్రేవో 102, కీరన్ పోలార్డ్ 62, జాసన్ హోల్డర్ 40, కార్లొస్ బ్రాత్‌వెయిట్ 33, కాగిసో రబదా 3/31, క్రిస్ మోరిస్ 3/63).
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 46 ఓవర్లలో 185 ఆలౌట్ (్ఫర్హాన్ బెహర్డియన్ 35, వేన్ పార్నెల్ 28, మోర్న్ మోర్కెల్ 32, ఇమ్రాన్ తాహిర్ 29, షానన్ గాబ్రియెల్ 3/17, సునీల్ నారైన్ 3/28, కార్లొస్ బ్రాత్‌వెయిట్ 2/39).

చిత్రం వెస్టిండీస్ సెంచరీ హీరో డారెన్ బ్రేవో