క్రీడాభూమి

క్యాలండర్ శ్లామ్ సాధ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 25: ఒకే ఏడాది నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించడం అసాధ్యమేమీ కాదని ఇటీవలే జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి, వింబుల్డన్ టోర్నీకి సిద్ధమవుతున్న ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ఆండీ ముర్రేను 3-6, 6-1, 6-2 తేడాతో ఓడించిన అతను కెరీర్ గ్రాండ్ శ్లామ్‌ను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతను క్యాలండర్ శ్లామ్‌పై కనే్నశాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను కైవసం చేసుకున్న అతను సోమవారం నుంచి ప్రారంభం కానున్న వింబుల్డన్‌లో టైటిల్‌పై కనే్నశాడు. వింబుల్డన్‌తోపాటు, యుఎస్ ఓపెన్‌ను కూడా అతను సాధిస్తే, ఈ ఏడాది నాలుగు గ్రాండ్ శ్లామ్స్‌ను అందుకున్న ఆటగాడిగా గుర్తింపు పొందుతాడు. అయితే, ఒకే క్యాలండర్ ఇయర్‌లో ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను ఇప్పటి వరకూ టెన్నిస్ చరిత్రలో ఇద్దరు మాత్రమే సాధించారు. 1938లో డాన్ బడ్జ్ మొట్టమొదటిసారి ఒకే సంవత్సరంలో నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. ఓపెన్ శకం ఆరంభమైన తర్వాత ఈ ఫీట్‌ను రాడ్ లెవర్ ఒక్కడే ప్రదర్శించగలిగాడు. అతను రెండు పర్యయాలు (1962, 1969) క్యాలండర్ శ్లామ్‌ను సాధించి టెన్నిస్ చరిత్రలో అరుదైన రికార్డును సృష్టించాడు. గత ఏడాది జొకోవిచ్ మిగతా మూడు గ్రాండ్ శ్లామ్స్‌లో టైటిళ్లను గెల్చుకున్నప్పటికీ, ఫ్రెంచ్ ఓపెన్ అందని ద్రాక్షగానే మిగలడంతో అతను క్యాలెండర్ ఇయర్‌లో గ్రాండ్ శ్లామ్‌ను అందుకునే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్‌ను సాధించిన అతను కెరీర్‌లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కూడా అందుకొని కెరీర్ గ్రాండ్ శ్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టైటిళ్లను కూడా అతను సాధిస్తే, 1969 తర్వాత ఒక క్యాలండర్ ఇయర్‌లో నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను గెల్చుకున్న తొలి క్రీడాకారుడిగా, మొత్తం మీద ఈ ఘనతను సాధించిన మూడో ఆటగాడిగా అతను రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదిస్తాడు. ఈఏడాది వరుసగా రెండు గ్రాండ్ శ్లామ్స్‌ను గెల్చుకున్న అతను మిగతా రెండు టోర్నీలు కైవసం చేసుకోవడం అసాధ్యమేమీ కాదని అన్నాడు. వింబుల్డన్ కోసం సిద్ధమవుతున్న జొకోవిచ్ తన కోచ్ బోరిస్ బెకర్, ఇతర సపోర్టింగ్ స్ట్ఫాతో కలిసి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ క్యాలండర్ గ్రాండ్ శ్లామ్ సాధ్యమేనని అన్నాడు. 11 పర్యాయాలు విఫలమైన తర్వాత, 12వ ప్రయత్నంలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సాధించగలిగడం ఎంతో ఆనందాన్నిస్తున్నదని చెప్పాడు. ప్రస్తుతానికి తాను ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నానని, ఇప్పుడు వింబుల్డన్‌పై దృష్టి కేంద్రీకరిస్తున్నానని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ క్యాలండర్ గ్రాండ్ శ్లామ్‌ను అందుకోవడం అసాధ్యమేమీ కాదని కెరీర్‌లో 12వ మేజర్ టైటిల్‌ను స్వీకరించిన జొకోవిచ్ అన్నాడు. జీవితంలో ఏది జరిగినా మంచికేనని అనుకుంటూ ముందుకు వెళ్లడం తన నైజమని పేర్కొన్నాడు.