క్రీడాభూమి

ఒలింపిక్స్‌కు దుతీ క్వాలిఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: వివాదాస్పద స్ప్రింటర్ దుతీ చాంద్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం అల్మాటీ (కజకస్థాన్)లో జరిగిన మీట్‌లో 20 ఏళ్ల దుతీ 100 మీటర్ల దూరాన్ని 11.30 సెకన్లలో పూర్తి చేసి, కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. అంతేగాక ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. ఆ మెగా టోర్నీలో పోటీపడేందుకు కనీస అర్హత 11.32 సెకన్లుకాగా, దుతీ కొత్త రికార్డుతో ఆ అర్హతను సొంతం చేసుకుంది. పురుషు సంబంధమైన హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయన్న కారణంగా కొంత కాలం సస్పెన్షన్‌కు గురైన దుతీ గత ఏడాది క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించి, అక్కడ విజయం సాధించింది. కేవలం హార్మోన్ల ఆధారంగా లింగ నిర్ధారణ చేయడం తగదని కోర్టు స్పష్టం చేసింది. దుతీ మహిళల విభాగంలో పాల్గొనకూడదంటూ భారత అథ్లెటిక్స్ సమాఖ్య తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది. పురుష లక్షణాలు ఎక్కువగా ఉండడంతో వీధినపడి, కోర్టులకెక్కి, చివరికి పంతం నెగ్గించుకున్న దుతీ ఇప్పుడు జాతీయ రికార్డును నెలకొల్పి, ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావడం విశేషం.

chitram మహిళల 100 మీటర్ల పరుగులో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పి, ఈ ఏడాది ఆగస్టులో జరిగే
రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హతను సంపాదించిన భారత స్ప్రింటర్ దుతీ చాంద్.