క్రీడాభూమి

ఉత్కంఠ మ్యాచ్‌లో బెంగాల్‌పై బెంగళూరు గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, జూన్ 26: ప్రో కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివా రం చివరి వరకూ తీవ్ర ఉత్కంఠను సృష్టించిన మ్యాచ్‌లో బెంగాల్ వారియ ర్స్‌పై బెంగళూరు బుల్స్ జట్టు 24-23 తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్న చందంగా పోటీ పడడంతో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది. చివరికి ఒక పాయంట్ తేడాతో బెంగాల్‌ను బెంగళూరు ఓడించింది. రోహిత్ కుమార్ ఏడు పాయంట్లు చేసి, బెంగళూరు విజయం లో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ సురేందర్ నాడా ఐదు పాయంట్లు చేశా డు. మోహిత్ చిల్లార్ మూడు పాయంట్లు సాధించాడు. కాగా, చివరి వరకు పోరాడిన బెంగాల్ తరఫున మోనూ గోయత్, సబ్‌స్టిట్యూట్ జంగ్ కున్ లీ చెరి ఐదు పాయంట్లు చేశారు. కెప్టెన్ నీలేష్ షింగే, గిరీష్ మారుతి ఎరాక్ చెరి మూడు పాయంట్లు సాధించారు. మొత్తం మీద ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ముగిసే వరకూ అభిమానులను ఆకట్టుకుంది. కేవలం ఒక పాయం ట్ తేడాతో విజేత ఎవరనేది స్పష్టం కావడమే ఈ మ్యాచ్ ఏ స్థాయలో పోటా పోటీగా జరిగిందో ఊహించుకోచ్చు.
ఏకపక్ష మ్యాచ్‌లో పునేరీ పల్టన్ ఘన విజయం
మొదటి మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠ సృష్టించగా, రెండో మ్యాచ్‌లో దాదాపుగా ఏకపక్షంగా కొనసాగింది. ఈ మ్యాచ్‌లో యు ముంబాను పునేరీ పల్టన్ 41-19 పాయంట్ల తేడాతో చిత్తుచేసింది. శనివారం జైపూర్ పింక్ పాం థర్స్‌ను ఓడించిన యు ముంబా ఆదివారం పునేరీ జట్టుకు గట్టిపోటీని ఇవ్వ లేకపోయంది. కాగా, మొదటి మ్యాజ్‌లో తెలుగు టైటాన్స్ నుంచి ఎదురైన తీవ్రమైన పోటీని తట్టుకొని 28-24 ఆధిక్యంతో గెలిచిన పునేరీ తన రెండో మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది. అజయ్ ఠాకూర్ 12 పా యంట్లతో రాణించగా కెప్టెన్ మన్జీత్ చిల్లార్ ఏడు పాయంట్లు చేశాడు. కాగా, యు ముంబా తరఫున కెప్టెన్ అనూప్ కుమార్ ఒక్కడే ఒంటరి పోరాటాన్ని సాగించి తొమ్మిది పాయంట్లు చేశాడు.