క్రీడాభూమి

బక్కా కీలక గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లెండేల్ (అమెరికా), జూన్ 26: కోపా అమెరికా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో కొలంబియా మూడో స్థానాన్ని ఆక్రమించింది. సెమీ ఫైనల్స్‌లో ఓడిన అమెరికా, కొలంబియా జట్ల మధ్య జరిగిన ఈ పోరు అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. అటాకింగ్‌ను మరచిపోయిన ఇరు జట్లు డిఫెన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో మ్యాచ్ ఆసక్తిని రేపలేకపోయింది. 31వ నిమిషంలో కార్లొస్ బక్కా కీలక గోల్ చేసి, కొలంబియాను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. అంతకు మించి ఈ మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ అంశమేమీ లేకపోయింది. బక్కా గోల్‌ను ఒడ్డున పడిన కొలంబియా చివరి వరకూ రక్షణాత్మక విధానాన్ని అనుసరిస్తూ, చివరికి అమెరికాను ఒక గోల్ తేడాతో ఓడించింది. సెమీ ఫైనల్స్‌లో అర్జెంటీనా చేతిలో 0-4 తేడాతో ఓటమిపాలైన అమెరికా మూడో స్థానం కోసం తీవ్రంగానే పోటీపడింది. సాధ్యమైనంత వరకూ కొలంబియాను గోల్స్ చేయకుండా అడ్డుకుంది. బక్కా చేసిన గోల్ కారణంగా పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ టోర్నీలో కొలంబియా చేతిలో అమెరికా ఓడడం ఇది రెండోసారి. కాగా, సెమీస్‌లో చిలీని ఎదుర్కొని 0-2 తేడాతో కంగుతిన్న కొలంబియా మూడో స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో వ్యూహాత్మకంగా ఆడింది. ఆ పోరాటానికి సరైన సమాధానం ఇవ్వలేకపోయన అమెరికా చివరికి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ప్రేక్షకుల మద్దతు లభించినప్పటికీ అమెరికా ఆటగాళ్లు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు.