క్రీడాభూమి

ఆస్ట్రేలియాకు ట్రై సిరీస్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్బడాస్, జూన్ 27: ముక్కోణపు వనే్డ ఇంటర్నేషనల్ క్రికెట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఈ జట్టు 58 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. బ్యాటింగ్ స్టార్ మిచెల్ మార్ష్ అనూహ్యంగా బౌలింగ్‌లో రాణించి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ అర్ధ శతకం సాధించడంతో ప్రత్యర్థి ముందు 271 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఉంచగలిగింది. దీనిని ఛేదించడంలో విఫలమైన విండీస్ 45.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరోన్ ఫించ్ (47), కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (46), మిచెల్ మార్ష్ (32) కొంత వరకు అండగా నిలవగా, వేడ్ 52 బంతులు ఎదుర్కొని అజేయంగా 57 పరుగులు సాధించాడు. ఫలితంగా ఆస్ట్రేలియా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 270 పరుగులు చేయగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, షానన్ గాబ్రియెల్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. కార్లొస్ బ్రాత్‌వెయిట్, కీరన్ పోలార్డ్, సునీల్ నారైన్, సులేమాన్ బెన్‌లకు తలా ఒక వికెట్ లభించింది.
ఆస్ట్రేలియాను ఓడించి, వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో ట్రై సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి 271 పరుగులు సాధించాల్సిన విండీస్‌కు ఓపెనర్లు ఆండ్రె ఫ్లెచర్, జాన్సన్ చార్లెస్ మంచి ఆరంభాన్నిచ్చే ఊపుమీద కనిపించారు. కానీ, 49 పరుగుల వద్ద ఫెచర్ (9)ను స్టీవెన్ స్మిత్ క్యాచ్ పట్టగా జొష్ హాజెల్‌వుడ్ అవుట్ చేయడంతో మొదటి వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్ చార్లెస్ (45), మిడిల్ ఆర్డర్‌లో దనేష్ రాందీన్ (40), జాసన్ హోల్డర్ (34) తప్ప మిగతా వారు రాణించలేకపోవడంతో విండీస్ 45.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజెల్‌వుడ్ 50 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌లో ఇప్పటి వరకూ ఎన్నడూ బౌలింగ్‌లో చెప్పుకోదగ్గ ప్రతిభ కనబరచిన మార్ష్ 32 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టడం విశేషం.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 9 వికెట్లకు 270 (ఆరోన్ ఫించ్ 46, మిచెల్ మార్ష్ 32, మాథ్యూ హేడెన్ 57 నాటౌట్, జాసన్ హోల్డర్ 2/51, షానన్ గాబ్రియెల్ 2/58).
వెస్టిండీస్ ఇన్నింగ్స్: 45.4 ఓవర్లలో 212 ఆలౌట్ (జాన్సన్ చార్లెస్ 45, దనేష్ రాందీన్ 40, జాసన్ హోల్డర్ 34, సునీల్ నారైన్ 23, జొష్ హాజెల్‌వుడ్ 5/50, మిచెల్ మార్ష్ 3/23).

చిత్రం వెస్టిండీస్‌ను ఓడించి కైవసం చేసుకున్న ట్రై సిరీస్ క్రికెట్ ట్రోఫీతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు