క్రీడాభూమి

జొకోవిచ్ తొలి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 27: వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్ శ్లామ్‌లో హ్యాట్రిక్ టైటిళ్లను కైవసం చేసుకునే దిశగా ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ తొలి అడుగు వేశాడు. సోమవారం ఇక్కడ ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో అతను జేమ్స్ వార్డ్‌ను 6-0, 7-6, 6-4 తేడాతో ఓడించాడు. 2011లో మొదటిసారి వింబుల్డన్ టైటిల్‌ను సాధించిన అతను తిరిగి 2014, 2015 సంవత్సరాల్లో విజేతగా నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అతను ఈసారి కూడా టైటిల్‌ను అందుకొని, హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్‌ను కైవసం చేసుకొని మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్న అతను తొలి రౌండ్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో అడుగుపెట్టిన వార్డ్‌ను సులభంగానే ఓడించాడు. 11వ సీడ్ డేవిడ్ గోఫిన్ 6-2, 6-3, 6-2 తేడాతో వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో వచ్చిన అలెగ్జాండర్ వార్డ్‌పై విజయం సాధించాడు. ఆడ్రియన్ మనారినో 6-2, 7-5, 6-4 స్కోరుతో కేల్ ఎడ్మండ్‌పై గెలిచాడు. 13వ సీడ్ డేవిడ్ ఫెరర్ 6-2, 6-1, 6-1 ఆధిక్యంతో డుడీ సెలాను ఓడించి రెండో రౌండ్ చేరాడు.
వీనస్ విలియమ్స్ పోరాటం
మహిళల సింగిల్స్‌లో ఐదు పర్యాయాలు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న వీనస్ విలియమ్స్ ఈసారి మొదటి రౌండ్‌లో తన ప్రత్యర్థి డొన్నా వెకిక్‌పై నెగ్గడానికి తీవ్రంగా పోరాడింది. చివరికి మ్యాచ్‌ని 7-6, 6-4 తేడాతో గెల్చుకుంది. తొమ్మిదో సీడ్ మాడిసన్ కీస్ 6-3, 6-1 ఆధిక్యంతో లారా సీగెమండ్‌పై సులభంగా విజయం సాధించింది. ఆస్ట్రేలియా సీనియర్ క్రీడాకారిణి సమంతా స్టొసుర్ 7-5, 6-3 స్కోరుతో మగ్దా లినెట్టేను ఓడించింది. సబినే లిసికీ 6-1, 6-3 తేడాతో షెల్బీ రోజర్స్‌పై గెలుపొందగా, డారియా కసట్కినా 6-0, 7-5 ఆధిక్యంతో విక్టోరియా దువల్‌పై నెగ్గింది.

చిత్రం నొవాక్ జొకోవిచ్