క్రీడాభూమి

చెప్పాల్సిందేమీ లేదు.. తప్పుకోవడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 28: భారత క్రికెట్ జట్టులో తన బాధ్యత ముగిసిందని, ఇప్పుడు తప్పుకోవలసిన సమయం వచ్చిందని టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్ర్తీ స్పష్టం చేశాడు. భారత జట్టు కొత్త కోచ్ పదవికోసం రవిశాస్ర్తీ ఇటీవల ప్రయత్నించినప్పటికీ అనిల్ కుంబ్లేకు ఆ పదవి దక్కడం తెలిసిందే. ‘నాకు సంబంధించినంతవరకు ఆ చాప్టర్ ముగిసింది. తప్పుకోవలసిన సమయం వచ్చిందని నేను బలంగా నమ్ముతున్నా. దీనికి సంబంధించి ఇంతకన్నా చెప్పాల్సింది ఏమీ లేదు’ అని రవిశాస్ర్తీ మంగళవారం పిటిఐతో అన్నాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీతో రవిశాస్ర్తీ ఇంటర్వ్యూ సమయంలో కమిటీ సభ్యుడు, టీమిండియా మాజీ కెప్టెన్ అయిన సౌరబ్ గంగూలీ గైరుహాజరయినట్లు మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అది రవిశాస్ర్తీకి తీవ్ర అసంతృప్తి కలిగించినట్లు కూడా ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయం గురించి అడగ్గా, సౌరబ్‌పై తనకెలాంటి వ్యక్తిగత వైరం లేదని ఆయన అంటూ, ఈ విషయం ఇంతటితో వదిలిపెడ్తే బాగుంటుందని అభిప్రాయ పడ్డాడు. తాను నిన్న రాత్రే విదేశాలనుంచి తిరిగి వచ్చానని, విశ్రాంతి తీసుకునే సమయం కూడా లేదని అంటూ ఆ విషయాన్ని దాటవేశాడు. అయితే రవిశాస్ర్తీ, గంగూలీ కొంతకాలంగా ఎడమొగం, పెడమొగంగా ఉంటున్నట్లు బిసిసిఐ అధికారులతో మాట్లాడిన తర్వాత అర్థమవుతోంది. గంగూలీ తన ఇంటర్వ్యూ సమయంలో గైరుహాజరవడం ద్వారా తనను అవమానపరిచాడని రవిశాస్ర్తీ భావిస్తుండగా, శాస్ర్తీ గొప్ప కామెంటేటరే కానీ, భారత జట్టు బలీయమైనదిగా మారడంలో అతని పాత్ర ఏమీ లేదని గంగూలీ భావిస్తున్నాడని వారి మాటలను బట్టి అర్థమవుతోంది.
ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో
రాజ్‌పుట్‌కు రజతం
బాకు (అజర్‌బైజాన్), జూన్ 28: ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యాన అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారత వర్థమాన షూటర్ సంజీవ్ రాజ్‌పుట్ మంగళవారం రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. రియో ఒలింపిక్స్‌కు ముందు జరుగుతున్న ఈ చివరి ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో రాజ్‌పుట్ పురుషుల 50 మీటర్ల రైఫిల్-3 పొజిషన్ ఈవెంట్‌లో 456.9 పాయింట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలువగా, క్రొయేషియా షూటర్ పీటర్ గోర్సా (457.5 పాయింట్లు) పసిడి పతకాన్ని, కొరియాకు చెందిన హియోన్‌జున్ కిమ్ (445.5 పాయింట్లు) కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో రాజ్‌పుట్ వరుసగా నీలింగ్, ప్రోన్, స్టాండింగ్ పొజిషన్‌లో మొత్తం 1,167 పాయింట్లు సాధించి ఏడవ స్థానంలో నిలువగా, భారత్‌కు చెందిన ఒలింపిక్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ 1,161 పాయింట్లతో 23వ స్థానంలోనూ, చైన్ సింగ్ 1,159 పాయింట్లతో 32వ స్థానంలోనూ నిలిచారు.
ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్‌లో
భారత్‌కు ఐదో స్థానం
న్యూఢిల్లీ, జూన్ 28: లండన్‌లో ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో ర్యాంకు ఎగబాకింది. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఆద్యంతం స్ఫూర్తిప్రదమైన ఆటతో అలరించిన భారత జట్టు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) తాజాగా ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో బెల్జియం, అర్జెంటీనా జట్లను అధిగమించి టాప్-5లో చోటు సంపాదించింది. చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్‌ను కైవసం చేసుకున్న ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు నెదర్లాండ్స్, జర్మనీ, ఇంగ్లాండ్ (అండ్ గ్రేట్ బ్రిటన్) వరుసగా మొదటి నాలుగు స్థానాలను నిలబెట్టుకోగా, మహిళల హాకీ జట్ల ర్యాంకింగ్స్‌లో ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ నెదర్లాండ్స్ మొదటి స్థానాన్ని, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో సంచలన విజయం సాధించిన అర్జెంటీనా జట్టు రెండో స్థానాన్ని కైవసం చేసుకోగా, ఆస్ట్రేలియా జట్టుకు మూడో ర్యాంకు, న్యూజిలాండ్ జట్టుకు నాలుగో ర్యాంకు, అమెరికా జట్టుకు ఐదో ర్యాంకు లభించాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఇంతకుముందు ఏడో స్థానంలో నిలిచిన అమెరికా జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం చక్కగా రాణించి కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో ర్యాంకుకు ఎగబాకింది. త్వరలో బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో జరుగనున్న ఒలింపిక్ క్రీడలు ముగిసిన తర్వాత అంతర్జాతీయ హాకీ సమాఖ్య తదుపరి ప్రపంచ ర్యాంకింగ్స్‌ను ప్రకటిస్తుంది.
ముంబయ టేబుల్ టెన్నిస్ లీగ్‌లో
ధన్‌రాజ్ పిళ్లై జట్టు
ముంబయి, జూన్ 28: ఒలింపిక్ క్రీడల్లో నాలుగుసార్లు బరిలోకి దిగిన భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లై సూపర్ టేబుల్ టెన్నిస్ లీగ్ (ఎంఎస్‌ఎల్)లో భాగస్వామిగా మారాడు. ఇటీవల ముంబయిలోని ఎన్‌ఎస్‌సిఐలో జరిగిన ఎంఎస్‌ఎల్ ఆటగాళ్ల వేలంలో ధన్‌రాజ్ పిళ్లై, ఇతర భాగస్వాములు కలిసి ‘బ్లేజింగ్ బాషర్స్’ జట్టును కొనుగోలు చేశారు. ఎంఎస్‌ఎల్ టోర్నమెంట్ వచ్చే నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతుంది. అయితే ఈ లీగ్‌లో ఒక జట్టుకు యజమానిగా వ్యవహరించడం ఈ ఈవెంట్‌తో తాను మరింతగా మమేకమయ్యేందుకు దోహదం చేస్తుందని ధన్‌రాజ్ పిళ్లై ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. దేశంలోని యువత మరింత ముందుకు వచ్చి వారికి ఇష్టమైన ఆట ఆడాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపాడు. ప్రస్తుతం ఎయిరిండియాలో క్రీడల బోర్డుకు సంయుక్త కార్యదర్శిగా సేవలు అందిస్తున్న ధన్‌రాజ్, ఈ పదవి ద్వారా తనకు పరిచయమైన క్రీడల్లో టేబుల్ టెన్నిస్ ఒకటని చెప్పాడు.
గత ఏడాది ఎంఎస్‌ఎల్‌లో బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి విచ్చేసినప్పుడు ఈ లీగ్ నిర్వాహకులు, ఆటగాళ్లు ప్రదర్శించిన ఉత్సాహం తనను ఆకట్టుకుందని, దీంతో సాధ్యమైతే ఎంఎస్‌ఎల్‌లో ఒక జట్టును కొనుగోలు చేయాలని ఆశిస్తున్నట్లు ఈ లీగ్ నిర్వాహక కమిటీ చైర్‌పర్సన్, జాతీయ టేబుల్ టెన్నిస్ మాజీ చాంపియన్ కమలేష్ మెహతాకు చెప్పానని ధన్‌రాజ్ వివరించాడు. డబ్బు సంపాదించుకునేందుకు తాను జట్టును కొనుగోలు చేయలేదని, ఈ ఈవెంట్‌లో భాగస్వామిని కావాలన్నదే తన ముఖ్య ఉద్ధేశ్యమని అతను స్పష్టం చేశాడు.