క్రీడాభూమి

సెరెనా శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 28: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అమెరికా ‘నల్ల కలువ’ సెరెనా విలియమ్స్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్న సెరెనా (34) మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన క్వాలిఫయర్ అమ్రా సాదికోవిచ్‌ను వరుస సెట్ల తేడాతో మట్టికరిపించి శుభారంభం సాధించింది. కెరీర్‌లో ఏడోసారి వింబుల్డన్ టైటిల్ సాధించడంతో పాటు గతంలో జర్మనీకి చెందిన మేటి క్రీడాకారిణి స్ట్ఫెగ్రాఫ్ 22 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లతో నెలకొల్పిన రికార్డును సమం చేయాలని ఉవ్విళ్లూరుతున్న సెరెనా విలియమ్స్ తన తల్లి సమక్షంలో ఈ మ్యాచ్ ఆడి 6-2, 6-4 తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. రెండో రౌండ్‌లో ఆమె అమెరికాకు చెందిన సహచర క్రీడాకారిణి క్రిస్టినా మెక్‌హాలేతో తలపడనుంది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో మెక్‌హాలే 7-5, 6-2 తేడాతో డానియేలా హంతుచోవాను ఓడించి రెండో రౌండ్‌లో ప్రవేశించింది. కాగా, మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌లలో 19వ సీడ్ డొమినికా సిబుల్కోవా, అన్‌సీడెడ్ క్రీడాకారిణులు ఎలెనా వెస్నినా, ఇంగ్-ఇంగ్ దువాన్, దరియా గావ్రిలోవా, యులియా పుతిన్‌త్సెవా కూడా గెలుపొందారు.
కాగా, పురుషుల సింగిల్స్ విభాగంలో స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. నాలుగేళ్ల నుంచి మేజర్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ఫెదరర్ తొలి రౌండ్‌లో 7-6 (7/5), 7-6 (7/3), 6-3 తేడాతో అతికష్టం మీద అర్జెంటీనాకు చెందిన గుయిడో పెల్లాను ఓడించి రెండో రౌండ్‌లో ప్రవేశించాడు. రెండో రౌండ్‌లో అతను బ్రిటిష్ క్వాలిఫయర్ మార్కస్ విల్లిస్‌తో తలపడనున్నాడు. కాగా, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌లలో ఏడో సీడ్ ఆటగాడు రిచర్డ్ గాస్కెట్, 12వ సీడ్ జో-విల్‌ఫ్రెడ్ సోంగా, 25వ సీడ్ విక్టర్ ట్రాయ్‌కీలతో పాటు అన్‌సీడెడ్ ఆటగాళ్లు డస్టిన్ బ్రౌన్, మార్సెల్ గ్రానోలర్స్, యెన్ సున్ లూ, జువాన్ మొనాకో, జాన్ మిల్‌మన్, డెన్నిస్ నొవికోవ్, ఆల్బర్ట్ రామోస్-వినోలస్ తమతమ ప్రత్యర్థులపై విజయం సాధించారు.