క్రీడాభూమి

నిర్ణయం మార్చుకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూనస్ ఎయిర్స్, జూన్ 28: కోపా అమెరికా ఫైనల్లో చిలీతో జరిగిన పెనాల్టీ షూటవుట్‌లో అర్జెంటీనా ఓటమి పాలవడానికి పరోక్షంగా తాను బాధ్యుడినయ్యానన్న బాధతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ రంగానికి దూరమవుతున్నట్లు ప్రకటించిన లియోనెల్ మెస్సీపై నిర్ణయం మార్చుకోవాలంటూ పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయి. మెస్సీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, జట్టుకు అతని సేవలు ఇంకా ఎంతో అవసరమని అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ డీగో మరడోనా, ఆ దేశ అధ్యక్షుడు వౌరిసియో మాక్రి కోరారు. ఆదివారం కోపా అమెరికా ఫైనల్ షూటవుట్‌లో పెనాల్టీ కిక్ మిస్ కాగానే మెస్సీ కన్నీళ్లతో మైదానుంచి బైటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ తాను అంతర్జాతీయ ఫుట్‌బాల్‌నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే మెస్సీ ఇంకా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో కొనసాగాలని, ఎందుకంటే అతను ఇంకా ఎన్నో రోజులు ఆడగలడని మరడోనా అన్నట్లు ‘లా నాసియాన్’ పత్రిక ఆన్‌లైన్ ఎడిషన్ తెలిపింది. ప్రపంచ చాంపియన్ కాదగ్గ ఫామ్‌లో అతను రష్యాకు వెళ్లాలని కూడా మరడోనా అన్నాడు. 2018లో రష్యాలో ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా, అర్జెంటీనా అధ్యక్షుడు మాక్రి మెస్సీకి ఫోన్ చేసి జాతీయ జట్టు పెర్ఫార్మెన్స్‌కు తాను ఎంతో గర్విస్తున్నానని చెప్తూ, విమర్శకుల మాటలను పట్టించుకోవద్దని అతనికి చెప్పారని మెక్రీ ప్రతినిధి ఒకరు ఎఎఫ్‌పి వార్తాసంస్థకు ఫోన్‌లో చెప్పారు. ఇదిలాఉండగా, మెస్సీ, అర్జెంటీనా జట్టులోని మిగతా సభ్యులు సోమవారం బ్యూనస్ ఎయిర్స్‌కు తిరిగి వచ్చినప్పుడు వందలాది మంది అభిమానులు ఘనంగా స్వాగతం పలుకుతూ ఫుట్‌బాల్‌నుంచి వైదొలగవద్దంటూ నినాదాలు చేస్తూ బ్యానర్లు చూపించారు. కాగా, గతంలో మరడోనా సైతం మెస్సీ కెప్టెన్‌గా ఎంతమాత్రం పనికిరాడంటూ విమర్శలు చేయడం గమనార్హం.