క్రీడాభూమి

ఇంగ్లండ్ ఇంటికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైస్ (ఫ్రాన్స్), జూన్ 28: యూరోకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో ఫేవరేట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో పెద్దగా పేరు లేని ఐస్‌లాండ్ చేతిలో 2-1 గోల్స్ తేడాతో ఓటమి పాలయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి తర్వాత ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో నాలుగో నిమిషంలోనే కెప్టెన్ వేన్ రూనీ పెనాల్టీ కిక్ ద్వారా గోల్ సాధించడంతో ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆనందానికి పట్ట పగ్గాలు లేకుండా పోయాయి. అయితే మరో నిమిషం గడవక ముందే ఐస్‌లాండ్ ఆటగాడు రగ్నార్ సిగార్డ్‌సన్ అద్భుతమైన గోల్‌తో స్కోరును సమం చేసి వారి సంతోషంపై నీళ్లు చల్లాడు. 18వ నిమిషంలో కోల్‌బీన్ సిగ్తోర్సన్ మరో గోల్ చేయడంతో ఐస్‌లాండ్ ఆధిక్యత సాధించింది. అప్పటినుంచి ఇంగ్లండ్ ప్రత్యర్థి గోల్‌పై పదే పదే దాడి చేసినా ఐస్‌లాండ్ రక్షణ పంక్తి ఆ దాడులన్నిటినీ సమర్థవంతంగా తిప్పి కొట్టారు. ఫలితంగా ఇంగ్లండ్ 1950 ప్రపంచ కప్ తర్వాత అంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ పార్ట్ టైమర్ జట్టయిన అమెరికా చేతిలో అనూహ్యంగా 1-0 గోలుల తేడాతో ఓటమి పాలవడం తెలిసిందే. ఈ అనూహ్య విజయంతో ఐస్‌లాండ్ తొలిసారిగా యూరోకప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు ఆతిథ్య జట్టు ఫ్రాన్స్‌ను ఎదుర్కొంటుంది.
కాగా, ఇంగ్లండ్ జట్టు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ దశలోనే నిష్కమించడంతో ఆ జట్టు మేనేజర్ రాయ్ హడ్గ్‌స్టన్ తన పదవిని కోల్పోవడం దాదాపు ఖాయమైంది. కాగా, ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో బలీయమైన ఇంగ్లండ్ జట్టును ఓడించడం ఐస్‌లాండ్ ఆటగాళ్ల జీవితాలనే మార్చివేసే అద్భుత అవకాశంగా ఆ జట్టు సహ కోచ్ హాల్ గ్రిమ్సన్ అభివర్ణించారు. మరోవైపు ఐస్‌లాండ్ చేతిలో ఇంగ్లండ్ జట్టు ఘోరపరాజయం పాలయిన వెంటనే ఇంగ్లండ్ జట్టు మేనేజర్ రాయ్ హడ్గ్‌సన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. వాస్తవానికి ఆయన కాంట్రాక్ట్ యూరో టోర్నమెంట్ తర్వాత ముగియాల్సి ఉంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత హడ్గ్‌సన్ ముందుగా సిద్ధం చేసిన ఒక ప్రకటనను మీడియా ముందు చదివి వినిపించాడు. తాను ఇంగ్లండ్ జట్టు మేనేజర్‌గా కొనసాగాలని అనుకొన్నప్పటికీ ఇప్పుడు పదవినుంచి తప్పుకోవడం మంచిదని భావించినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపాడు.