క్రీడాభూమి

డే/నైట్ టెస్టు లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యటన షెడ్యూలు ఇదీ
సెప్టెంబర్ 22-26: కాన్పూర్‌లో తొలి టెస్టు
సెప్టెంబర్ 20-అక్టోబర్ 4: ఇండోర్‌లో రెండో టెస్టు
అక్టోబర్ 8-12: కోల్‌కతాలో మూడో టెస్టు
అక్టోబర్ 16: ధర్మశాలలో తొలి వనే్డ
అక్టోబర్ 19: ఢిల్లీలో రెండో వనే్డ
అక్టోబర్ 23: మొహాలీలో మూడో వనే్డ
అక్టోబర్ 26: రాంచీలో నాలుగో వనే్డ
అక్టోబర్ 29: విశాఖలో ఐదో వనే్డ

న్యూఢిల్లీ, జూన్ 28: టీమిండియాతో మూడు టెస్టులు, ఐదు వనే్డ మ్యాచ్‌లు ఆడేందుకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సెప్టెంబర్‌లో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటన సందర్భంగా తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఇండోర్ సిద్ధమవుతోంది. విదేశీ జట్లు మన దేశంలో పర్యటించేందుకు వస్తున్నప్పుడు ఆ వివరాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పెద్దలో లేక బిసిసిఐ ఉన్నతాధికారులో వెల్లడించడం పరిపాటిగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా న్యూజిలాండ్ జట్టు పర్యటనకు సంబంధించిన వివరాలను బిసిసిఐ ప్రస్తుతం టీమిండియా టాప్ క్రికెటర్ల ద్వారా వెల్లడించి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టం విశేషం. అలాగే న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా దేశంలో తొలిసారి పింక్ బాల్‌తో అంతర్జాతీయ డే/నైట్ టెస్టు మ్యాచ్‌ను నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన బిసిసిఐ ప్రస్తుతం దాని ఊసెత్తకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. న్యూజిలాండ్‌తో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ‘ట్విట్టర్’లోని తన పేజీలో ప్రకటించాడు. ‘దేశంలోని అత్యంత పురాతన క్రికెట్ వేదికల్లో ఒకటైన కాన్పూర్‌లో భారత జట్టు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి హోమ్ సీజన్‌ను ప్రారంభిస్తుంది’ అని కోహ్లీ వెల్లడించగా, సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుందని యువ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే, కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో అక్టోబర్ 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చివరి టెస్టు జరుగుతుందని సీమర్ మహ్మద్ సమీ ట్వీట్ చేశారు. ‘కివీస్‌తో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. క్రికెట్ దిగ్గజం సయ్యద్ ముస్తాక్ అలీ స్వస్థలమైన ఇండోర్ ఈ మ్యాచ్ ద్వారా తొలిసారి టెస్టు క్రికెట్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఎదురుచూస్తోంది’ అని అని రహానే పేర్కొన్నాడు.
ధర్మశాలలో తొలి వనే్డ
ఇదిలావుంటే, భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వనే్డల సిరీస్‌లో అక్టోబర్ 16వ తేదీన తొలి మ్యాచ్‌ను ధర్మశాలలో నిర్వహించనుండగా, మిగిలిన మ్యాచ్‌లకు ఢిల్లీ (అక్టోబర్ 19), మొహాలీ (అక్టోబర్ 23), రాంచీ (అక్టోబర్ 26), విశాఖపట్నం (అక్టోబర్ 29) ఆతిథ్యమివ్వనున్నాయి. విశాఖలో జరిగే చివరి వనే్డకి అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావాలని కొద్ది రోజుల క్రితం టీమిండియాకు కొత్త ప్రధాన కోచ్‌గా నియమితుడైన మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ‘ట్విట్టర్’ ద్వారా విజ్ఞప్తి చేశాడు. ‘అక్టోబర్ 29వ తేదీన కివీస్‌తో చివరి వనే్డ మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చేందుకు విశాఖపట్నం సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కి అభిమానులు భారీగా తరలివచ్చి టీమిండియాకు ఉత్తేజాన్నివ్వాలి’ అని కుంబ్లే కోరాడు.
కాగా, భారత క్రికెట్‌లో ముఖ్యమైన దశకు శ్రీకారం చుడుతున్న తమకు న్యూజిలాండ్‌తో జరిగే హోమ్ సిరీస్ ఎంతో ప్రాధాన్యమైనదని, ఏ ఆటలోనైనా మొదటి స్థానం ఆటగాళ్లదేనని, అందుకే భారత్‌లో న్యూజిలాండ్ జట్టు పర్యటనకు సంబంధించిన వివరాలను గత సాంప్రదాయానికి భిన్నంగా టీమిండియా ఆటగాళ్లతో ప్రకటింపజేసి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టామని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పిటిఐ వార్తా సంస్థకు వివరించాడు. ఇటువంటి చర్యలు తాము అభిమానలకు మరింత చేరువయ్యేందుకు దోహదపడతాయని, కనుక మున్ముందు కూడా ఇటువంటి చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశాడు.
chitram...

దేశంలోనే తొలిసారి ఇటీవల బెంగాల్ క్రికెట్ అసోసియేషన్
సూపర్‌లీగ్ ఫైనల్‌లో డే/నైట్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన ఈడెన్ గార్డెన్స్