క్రీడాభూమి

సూపర్ స్టార్ రోనాల్డోపైనే పోర్చుగల్ ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్సెలీ, జూన్ 29: యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్‌లో స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో సామర్థ్యంపై పూర్తి భరోసాతో పోర్చుగల్ జట్టు బరిలోకి దిగనుంది. గురువారం పోలాండ్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో రోనాల్డో ఏ స్థాయిలో రాణిస్తాడనే అంశంపైనే పోర్చుగల్ విజయావకాశాలు ఆధారపడ్డాయి. యూరోపియన్ చాంపియన్‌షిప్స్ ఒక సీజన్‌లో అత్యధికంగా తొమ్మిది గోల్స్ సాధించి మైఖేల్ ప్లాటినీ నెలకొల్పిన రికార్డును సమం చేయడానికి రొనాల్డో కేవలం ఒక గోల్ దూరంలో ఉన్నాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ను హాట్ ఫేవరిట్‌గా పేర్కొంటున్నప్పటికీ, పోలాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలులేదని విశే్లషకుల అభిప్రాయం. ప్రత్యేకించి పోలాండ్ స్టార్ రాబర్ట్ లెవాండొవ్‌స్కీతో జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. అనేక టోర్నీల్లో పోలాండ్‌కు అద్భుత విజయాలను సాధించిపెట్టిన లెవాండొవ్‌స్కీ జరిపే దాడులను పోర్చుగీస్ రక్షణ విభాగం ఏ విధంగా ఎదుర్కొంటుందనేది చూడాలి. పోర్చుగల్ ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌లనూ డ్రా చేసుకుంది. మొదటి మ్యాచ్‌లో ఐస్‌లాండ్‌ను ఢీకొన్న ఈ జట్టు మ్యాచ్‌ని 1-1గా ముగించింది. నాని కీలక గోల్ చేసి, జట్టును ఓటమి నుంచి కాపాడాడు. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రియాతో పోర్చుగల్ తలపడింది. ఆ మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. మూడో మ్యాచ్‌లో హంగరీపై మూడు గోల్స్ చేసినప్పటికీ, ప్రత్యర్థికి కూడా అదే సంఖ్యలో గోల్స్ చేసే అవకాశమిచ్చి, చివరికి డ్రాతో సంతృప్తి చెందింది. ఆ మ్యాచ్‌లో నాని ఒక గోల్ చేయగా, రొనాల్డో రెండు గోల్స్ సాధించాడు. గ్రూప్ దశలో మ్యాచ్‌ల ఫలితాలను బట్టిచూస్తే పోర్చుగల్ కంటే పోలాండ్ మెరుగైన స్థితిలో ఉంది. ఆ జట్టు మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్‌ని డ్రాగా ముగించింది. మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను, చివరిదైన మూడో మ్యాచ్‌లో ఉక్రెయిన్‌ను ఓడించిన పోలాండ్ రెండో మ్యాచ్‌లో జర్మనీని ఢీకొని 0-0గా మ్యాచ్‌కి తెరదించింది. పోర్చుగల్‌తో జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో పోలాండ్ ఇదే స్థాయిలో చెలరేగుతుందా లేదా అన్నది ఆసక్తిని రేపుతోంది. కాగా, ఈ టోర్నీలో జూలై ఒకటో తేదీన వేల్స్, బెల్జియం, రెండున జర్మనీ, ఇటలీ, మూడున ఫ్రాన్స్, ఐస్‌లాండ్ జట్లు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో తలపడతాయి.