క్రీడాభూమి

వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ మూడో రౌండ్‌కు జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 29: ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా మరో అడుగు ముందుకేశాడు. రెండో రౌండ్‌లో అతను ఆడ్రియన్ మనారినోను 6-4, 6-3, 7-6 తేడాతో ఓడించి మూడో రౌండ్ చేరాడు. అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో రెండో ర్యాంక్ ఆటగాడు ఆండీ ముర్రే మొదటి రౌండ్‌లో లియామ్ బ్రాడీని 6-2, 6-3, 6-4 తేడాతో ఓడించాడు. వర్షం కారణంగా పలు మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడగా, అంతకు ముందు వాయిదా పడిన వాటిని సమయానుకూలంగా పూర్తి చేశారు. నాలుగో ర్యాంకర్ ఆటగాడు స్టానిస్లాస్ వావ్రిన్కా 7-6, 6-1, 6-7, 6-4 స్కోరుతో టేలర్ ఫ్రిజ్‌ను అతి కష్టం మీద ఓడించాడు. నిక్ కిర్గియోస్ 6-4, 6-3, 6-7, 6-1 ఆధిక్యంతో రాడెక్ స్టెపానెక్‌పై గెలిచాడు. థామస్ బెర్డిచ్ 7-6, 5-7, 6-1, 7-6 స్కోరుతో డోడింగ్‌పై విజయం సాధించాడు. ఒక మారథాన్ మ్యాచ్‌లో బెర్నార్డ్ టామిక్ 4-6, 6-3, 6-3, 3-6, 6-4 స్కోరుతో ఫెర్నాండొ వెర్డాస్కోపై గెలిచాడు.
కుజ్నెత్సొవా చేతిలో వొజ్నియాకి ఓటమి
మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ కరోలిన్ వొజ్నియాకి పరాజయాన్ని చవి చూసింది. స్వెత్లానా కుజ్నెత్సొవా ఆమెను 7-5, 6-4 తేడాతో ఓడించింది. ఫేవరిట్‌గా బరిలోకి దిగిన వొజ్నియాకి ఏ తనపై అభిమానులు ఉంచిన అంచనాలకు తగినట్టు ఆడలేకపోయింది. మరో మ్యాచ్‌లో కొకో వండెవాగ్ 6-2, 7-6 ఆధిక్యంతో కాతెరిన బొండెరెన్కోపై విజయం సాధించింది. రాబర్టా విన్సీ 6-2, 5-7, 6-3 స్కోరుతో అలీసన్ రిస్కేపై గెలిచింది. అగ్నీస్కా రద్వాన్‌స్కా 6-2, 6-1 తేడాతో కాతెరిన కొజ్‌లొవాను ఓడించి రెండో రౌండ్ చేరింది.