క్రీడాభూమి

ప్రో కబడ్డీ టైటాన్స్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూన్ 29: ప్రో కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భాగంగా జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు నాలుగు పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది. పాంథర్స్ 28 పాయింట్లు సంపాదించగా, టైటాన్స్ జట్టు 24 పాయింట్లు చేసింది. పాంథర్స్ తరఫున రాజేష్ నర్వాల్ అత్యధికంగా ఎనిమిది పాయింట్లు సాధించాడు. జస్వీర్ సింగ్, అమిత్ హూతా, రణ్ సింగ్ తలా మూడు పాయింట్లు చేశారు. టైటాన్స్ ఆటగాళ్లలో సందీప్ నర్వాల్ ఆరు పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వినోద్ కుమార్, నీలేష్ సాలుంకే చెరి నాలుగు పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
యు ముంబా ఓటమి
చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో పాట్నా పైరేట్స్‌తో ఢీకొన్న యు ముంబా ఓటమిపాలైంది. ఈ జట్టు 34 పాయంట్లు సాధించగా, పాట్నా 36 పాయంట్లు సంపా దించింది. పాట్నా ఆటగాడు ప్రదీప్ నర్వాల్ 18 పాయంట్లు చేయడం విశేషం.

కోహ్లీ సేన
ప్రాక్టీస్ మొదలు

బెంగళూరు, జూన్ 29: వెస్టిండీస్ టూర్‌కు వెళ్లనున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు బుధవారం ప్రాక్టీస్ మొదలు పెట్టింది. వెస్టిండీస్‌లో టీమిండియా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పోటీపడుతుంది. మొదటి టెస్టు జూలై 21న అంటీగువాలో మొదలవుతుంది. రెండో టెస్టు జమైకాలోవ జూలై 30న ఆరంభమవుతుంది. మూడో టెస్టు సెయింట్ లూయిస్‌లో ఆగస్టు 9న, చివరిదైన నాలుగో టెస్టు ఆగస్టు 18న ట్రినిడాడ్ అండ్ టొబాగోలో మొదలవుతాయి. జట్టుకు కోహ్లీ నాయకత్వం వహిస్తుండగా, యువ, సీనియర్ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. కాగా, ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీసహా టీమిండియా సభ్యులంతా పాల్గొన్నారు. కోచ్ అనీల్ కుంబ్లే, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ పర్యవేక్షణలో వీరి ప్రాక్టీస్ కొనసాగింది.

కెనడా ఓపెన్ బాడ్మింటన్
సాయి గురుదత్ ముందంజ

కాల్గరీ (కెనడా), జూన్ 29: కెనడా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు ఆర్‌ఎంవి గురుసాయిదత్ మొదటి రౌండ్‌ను విజయవంతంగా ముగించి ముందంజ వేశాడు. అతను 21-7, 21-6 తేడాతో ఆస్ట్రియాకు చెందిన రుడిగెర్ నెడ్‌ను కేవలం 18 నిమిషాల్లోనే ఓడించాడు. కాగా, ప్రతుల్ జోషి, హర్షీల్ డానీ కూడా తమతమ ప్రత్యర్థులపై గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. ప్రతుల్ 21-13, 21-12 ఆధిక్యంతో స్థానిక ఆటగాడు బైరోన్ హొల్సెక్‌పై గెలిచాడు. హర్షీల్ 21-11, 21-14 స్కోరుతో తిమోతీ చియూపై విజయం సాధించాడు.

డబ్ల్యుబివో ఆసియా పసిఫిక్ బాక్సింగ్‌లో
సంజీవ్, వికాస్ ఫైట్

న్యూఢిల్లీ, జూన్ 29: బ్రిటన్‌లో నివాసం ఉంటున్న భారత సంతతికి చెందిన సంజీవ్ సింగ్ సహోటా, హర్యానా బాక్సర్ వికాస్ లోహన్ మధ్య జరగనుంది. డబ్ల్యుబివో ఆసియా పసిఫిక్ మిడిల్‌వెయిట్ చాంపియన్‌షిప్‌లో భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్, కెర్రీ హోప్ జూలై 16న తలపడనున్నారు. ఆ ఫైట్ కంటే ముందే సంజీవ్, వికాస్ ఫైట్ ఉంటుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.