క్రీడాభూమి

వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 30: కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిళ్లను కైవసం చేసుకున్న ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ ఇక్కడ జరుగుతున్న వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో మూడో రౌండ్ చేరాడు. రెండో రౌండ్‌లో అతను క్వాలిఫయర్ మార్కస్ విల్స్‌ను 6-0, 6-3, 6-4 తేడాతో సునాయాసంగా ఓడించాడు. అంతర్జాతీయ టెన్నిస్‌లో అపారమైన అనుభవం ఉన్న ఫెదరర్‌కు విల్స్ ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయాడు. మరో మ్యాచ్‌లో మిలోస్ రవోనిక్ 7-6, 6-4, 6-2 స్కోరుతో ఆడ్రియన్ సెప్పీపై విజయం సాధించి, మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. వర్షం కారణంగా పలుమార్లు వాయిదా పడిన మ్యాచ్‌లో డామినిక్ థియేమ్ 7-5, 6-4, 6-4 స్కోరుతో ఫ్లోరియన్ మేయర్‌పై విజయం సాధించాడు. కెయ్ నిషికోరి 4-6, 6-4, 6-4, 6-2 తేడాతో జూలియస్ బెనాట్యూపై గెలిచి ముందంజ వేశాడు.
మహిళల సింగిల్స్‌లో వీనస్ విలియమ్స్ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్‌లో ఆమె మరియా సకారీని 7-5, 4-6, 6-3 తేడాతో ఓడించింది. కాగా, రెండో రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో సబినె లిసికీ 6-4, 6-2 తేడాతో ఆస్ట్రేలియా సీనియర్ క్రీడాకారిణి సమంతా స్టొసుర్‌పై గెలిచి మూడో రౌండ్ చేరింది. తొలి రౌండ్‌లో జరిగిన కీలక మ్యాచ్‌ల్లో బిలిండా బెన్సిక్ 6-2, 6-3 తేడాతో స్వెతానా పిరొన్కొవాను ఓడించింది. యూగెనీ బుచార్డ్ 6-3, 6-4 ఆధిక్యంతో మగ్దలీన రిబరికొవాపై విజయం సాధించింది. జొహాన్నా కొన్టా 6-1, 7-5 స్కోరుతో మోనికా పగ్‌పై గెలిచింది.

చిత్రం.. రోజర్ ఫెదరర్