క్రీడాభూమి

కెనడా ఓపెన్ బాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్‌కు ప్రణయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్గరీ (కెనడా), జూన్ 30: కెనడా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ ప్రీ క్వార్టర్స్‌కు చేరాడు. రెండో రౌండ్‌లో అతను 13-21, 21-11, 21-15 తేడాతో స్వీడన్‌కు చెందిన మథియాస్ బోర్గ్‌ను ఓడించాడు. మొదటి సెట్‌ను కోల్పోయిన్పప్పటికీ, మిగతా రెండు సెట్లలో అతను ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచాడు. మరో మ్యాచ్‌లో స్థానిక ఆటగాడు మార్టిన్ గిఫ్రెపై 17-21, 21-17, 21-13 స్కోరుతో గెలిచిన అజయ్ జయరామ్ కూడా ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. గురుసాయి దత్ 21-8, 21-6 స్కోరుతో జొనథాన్ లేపై గెలిచి ముందంజ వేశాడు. సాయి ప్రణీత్‌కు కూడా ప్రీ క్వార్టర్స్‌లో స్థానం లభించింది. అతను రెండో రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన కాన్ చవో యూను ఓడించాడు.