క్రీడాభూమి

లక్ష్మణ్‌పై ఆరోపణలు నిరాధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: భారత క్రికెట్ సలహా కమిటీ (సిఎసి) సభ్యుడిగా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్‌కు పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని వచ్చిన ఆరోపణలు నిరాధారమని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) స్పష్టం చేసింది. ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఇంటర్వ్యూలో జరిగినప్పుడు ఈ కమిటీలోని ఇతర ఇద్దరు సభ్యులు సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీతో కలిసి లక్ష్మణ్ పాల్గొనాల్సి ఉండింది. అయితే, కుంబ్లేకు ఇంటర్వ్యూ జరిగిన రోజున గంగూలీ లేడు. కమిటీలోని సచిన్, లక్ష్మణ్ మాత్రమే అతనిని ప్రశ్నించారు. కుంబ్లే కంపెనీ ‘టెన్విక్’లో లక్ష్మణ్‌కు వాటాలున్నాయన్న వార్త వెలుగు చూసింది. అతనే కుంబ్లేకు ఇంటర్వ్యూ చేయడంలో ఔచిత్యం ఏమిటన్న చర్చ తెరపైకి వచ్చింది. దీనిపై బిసిసిఐ వివరణ ఇచ్చింది. టెన్విక్ కంపెనీలో లక్ష్మణ్‌కు గతంలో ఐదు శాతం వాటాలు ఉండేవని, కానీ, అతను వాటిని 2006లో అమ్మేశాడని బిసిసిఐ పేర్కొంది. ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ టెన్విక్‌తో అతనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పరస్పర ప్రయోజనాలన్న ప్రశే్న ఉత్పత్తి కాదని తెలిపింది.