క్రీడాభూమి

యూరో సాకర్ సెమీస్‌కు పోర్చుగల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్సెల్లీ, జూలై 1: యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో పోర్చుగల్ అతి కష్టం మీద సెమీ ఫైనల్స్ చేరింది. పోలాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యంకాగా, పోలాండ్ 5-3 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభమైన మరుక్షణమే దాడికి ఉపక్రమించిన పోలాండ్‌కు రెండో నిమిషంలోనే రాబర్ట్ లావెండోవ్‌స్కీ గోల్‌ను సంపాదించిపెట్టాడు. ఊహించని ఈ పరిణామంతో అప్రమత్తమైన పోర్చుగీస్ ఆటగాళ్లు ఎదురుదాడికి ఉపక్రమించారు. వారి కృషికి 33వ నిమిషంలో ఫలితం దక్కింది. రెనాటో సాంచెస్ ఈక్వెలైజర్‌ను సాధించగా, ఇరు జట్లు పూర్తి రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయి. ఫలితంగా మ్యాచ్ నిర్ణీత సమయంలో మరో గోల్ నమోదు కాలేదు. ఎక్‌స్ట్రా టైమ్‌లోనూ అదే పరిస్థితి కొనసాగింది. ఒకరి అవకాశాలను మరొకరు దెబ్బతీయడమే వ్యూహంగా ఎంచుకున్నారు. చివరికి మ్యాచ్ 1-1గా టైకాగా, ఫలితాన్ని తేల్చడానికి పెనాల్టీ షూటౌట్‌ను అమలు చేశారు. స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో తన ప్రయత్నంలో సఫలమై, పోర్చుగల్‌కు గోల్‌ను అందించగా, పోలాండ్ తరఫున రాబర్ట్ లావెండోవ్‌స్కీ గోల్ చేశాడు. రెనాటో సాంచెజ్ గోల్‌కు దీటుగా పోలాండ్‌కు అర్కాడిజ్ మిలిక్ గోల్ సాధించిపెట్టాడు. మూడో అవకాశాన్ని పోర్చుగల్ తరఫున జవో మొటిన్హో, పోలాండ్ తరఫున కమిల్ గ్లిక్ సద్వినియోగం చేసుకున్నాడు. నాలుగో షూట్‌ను పోర్చుగల్ హీరో నాని గోల్‌గా మలచగా, పోలాండ్ తరఫున అవకాశాన్ని దక్కించుకున్న జాకబ్ బ్లాజికొవ్‌స్కీ తన ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఫలితంగా పోర్చుగల్ 4-3 ఆధిక్యాన్ని సంపాదించింది. ఐదో ప్రయత్నంలో రికార్డో కరెస్మా గోల్ చేసి, తన జట్టు ఆధిక్యాన్ని 5-3కు చేర్చాడు. దీనితో ఐదో అవకాశాన్ని పోలాండ్ తీసుకున్నప్పటికీ ఫలితం ఉండని కారణంగా ఆటను నిలిపేసి, పోర్చుగల్‌ను విజేతగా ప్రకటించారు. కరెస్మా ప్రయత్నం విఫలమై ఉంటే, పోలాండ్‌కు మరో అవకాశం లభించి ఉండేది. కానీ, అతను ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని గోల్ పోస్టులోకి కొట్టి, పోర్చుగల్‌ను విజయపథంలో నడిపించాడు.