క్రీడాభూమి

వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 1: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న అగ్నీస్కా రద్వాన్‌స్కా ఇక్కడ జరుగుతున్న వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ టైటిల్‌పై అశలు పెట్టుకుంది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి టైటిల్ సాధించిన రెండో ర్యాంక్ క్రీడాకారిణి గార్బినె ముగురుజా రెండో రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించడంతో రద్వాన్‌స్కా విజయావకాశాలు మెరుగుపడ్డాయి. 124వ ర్యాంక్ క్రీడాకారిణి జనా సెపలోవాతో తలపడిన ముగురుజా అనూహ్యంగా 3-6, 2-6 తేడాతో ఓటమిపాలైంది. ఆమె నిష్క్రమించడంతో రద్వాన్‌స్కా టైటిల్‌పై ఆశలు పెంచుకుంది. సెరెనా విలియమ్స్ ఈఏడాది ఇప్పటి వరకూ జరిగిన రెండు గ్రాండ్ శ్లామ్ టోర్నీలు ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్స్ చేరినప్పటికీ రన్నరప్ ట్రోఫీకే పరిమితమైంది. ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో సెరెనా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా రద్వాన్‌స్కాకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో అనా కొన్జును 6-2, 4-6, 9-7 తేడాతో ఓడించిన రద్వాన్‌స్కా ఈసారి టైటిల్ రేసులో తాను కూడా ఉన్నానని నిరూపించింది. ఇలావుంటే, మహిళల రెండో రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో జొహాన్నా కొన్టాను యూగెనీ బుచార్డ్ 6-2, 1-6, 6-1 తేడాతో ఓడించింది. ఐదో సీడ్ సిమోనా హాలెప్ 6-1, 6-1 స్కోరుతో ఫ్రాన్సిస్కా షియవోన్‌పై గెలిచింది. క్వాలిఫయర్ జూలియా బోస్రప్‌తో తలపడిన ఏడో ర్యాంక్ క్రీడాకారిణి బెలిండా బెన్సిక్ మొదటి సెట్‌ను 4-6 తేడాతో ఓటమిపాలైంది. రెండో సెట్‌లో 0-1 తేడాతో వెనుకబడివున్న సమయంలో కండరాలు బెణకడంతో ఆమె మ్యాచ్ నుంచి వైదొలగింది. బొస్రప్ మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. కొకో వాండెవాగ్ 6-2, 6-3 ఆధిక్యంతో తిమియా బబోస్‌పై విజయం సాధించింది.
వావ్రిన్కా నిష్క్రమణ
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో నాలుగో సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కాకు చుక్కెదురైంది. జువాన్ డెల్ పొట్రొ అ తనిని 3-6, 6-3, 7-6, 6-3 తేడాతో ఓడించాడు. మొదటి సెట్ గెలిచిన వావ్రిన్కా ఆతర్వాత నీరసపడి, గేమ్‌ను కోల్పోయాడు. కాగా, గ్రిగర్ దిమిత్రోవ్ 6-3, 7-6, 4-6, 6-4 తేడాతో 16వ సీడ్ గిలెస్ సిమోన్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. డానియెల్ ఇవాన్స్ 7-6, 6-4, 6-1 ఆధిక్యంతో అలెక్సాండర్ డొల్గొపొలొవ్‌పై గెలిచాడు. ఒక మారథాన్ మ్యాచ్‌లో బెర్నార్డ్ టామిక్ 7-6, 6-3, 6-7, 6-3 తేడా తో రడూ అల్బట్‌ను ఓడించాడు.