క్రీడాభూమి

భారత్, కివీస్ సిరీస్‌లో డే/నైట్ టెస్టు లేనట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: న్యూజిలాండ్‌తో ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఒక దానిని డే/నైట్ మ్యాచ్‌గా ఆడతామని ఇంతకు ముందు ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) యుటర్న్ తీసుకుంది. ఆ సిరీస్‌లో డే/నైట్ టెస్టు ఉండే అవకాశం లేదని బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి వ్యాఖ్యానించాడు. కివీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో డే/నైట్ మ్యాచ్ ఉంటుందని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఏప్రిల్ మాసంలో ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. గులాబీ రంగు బంతితో డే/నైట్ టెస్టును ఆడించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించాడు. అయితే, గతంలో అనుకున్న విధంగా న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో అది సాధ్యం కాదని అమితాబ్ చౌదరి పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నాడు. దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో ప్రయోగాత్మకంగా డే/నైట్ మ్యాచ్‌లను నిర్వహిస్తామని అతను పేర్కొన్నాడు. చాలా మంది టాప్ క్రికెటర్లు ఆ టోర్నీలో పాల్గొంటారని, వారందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత డే/నైట్ మ్యాచ్‌ని నిర్వహించడంపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నాడు. ముందుగా ఎలాంటి ప్రయోగం చేయకుండా, ఒకసారి డే/నైట్ టెస్టును నిర్వహించకూడదన్నది బిసిసిఐ నిశ్చితాభిప్రాయమని చెప్పాడు. న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు ఆరంభానికి ముందు దులీప్ ట్రోఫీ టోర్నీ ఉంటుందని అన్నాడు. ఈ సిరీస్‌లో డే/నైట్ టెస్టు లేకపోతే, ఆతర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగే సిరీస్‌లోనైనా చేరుస్తారా అన్న ప్రశ్నకు అమితాబ్ చౌదరి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఇంగ్లాండ్‌తో ఐదు, ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులను టీమిండియా ఆడుతుందని, అయితే, వాటిలో ఒకదానిని డే/నైట్ ఈవెంట్‌గా ఉంచాలా లేదా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదని అన్నాడు. దులీప్ ట్రోఫీలో డే/నైట్ మ్యాచ్‌లు ఆడించి, అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి రావచ్చని అన్నాడు. కొన్ని దేశాలు ఇప్పటికే డే/నైట్ టెస్టుల వైపు మొగ్గు చూపడాన్ని ప్రస్తావించగా, తాము మాత్రం అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అన్నాడు. మొత్తం మీద అమితాబ్ చౌదరి మాటలు బట్టి చూస్తే ఇప్పట్లో డే/నైట్ మ్యాచ్‌లు లేనట్టే కనిపిస్తున్నది. ఆటగాళ్లలో చాలా మంది ఈ మ్యాచ్‌ల పట్ల ఉత్సాహం చూపిస్తే, స్పాన్సర్లలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం. అందుకే బిసిసిఐ ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నది.