క్రీడాభూమి

ఐసిసి క్రికెట్ కమిటీ పదవికి రవిశా స్ర్తీ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలోని క్రికెట్ కమిటీలో తన పదవికి భారత మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ డైరెక్టర్ రవి శాస్ర్తీ రాజీనామా చేశాడు. ఎంతో కీలకమైన మీడియా ప్రతినిధిగా అతను కొనసాగుతున్నాడు. తాను పూర్తి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని, క్రికెట్ కమిటీలో కొనసాగడం కష్టమవుతుందని అతను ఒక ప్రకటనలో తెలిపాడు. ఆరు సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగానని, ఇప్పుడు తగినంత సమయం లేని కారణంగా రాజీనామా పత్రాన్ని ఐసిసి చైర్మన్‌కు పంపానని వివరించాడు. రవి శాస్ర్తీ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్టు చెప్తున్నప్పటికీ, టీమిండియా చీఫ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే ఎంపిక కావడం వల్లే అతను తప్పుకొన్నట్టు తెలుస్తున్నది. ఐసిసి క్రికెట్ కమిటీకి చైర్మన్‌గా కుంబ్లే వ్యవహరిస్తున్నాడు. టీమిండియా కోచ్ పదవికి రవి శాస్ర్తీ తీవ్రంగా పోటీపడినప్పటికీ, ఎవరూ ఊహించని విధంగా దానిని కుంబ్లే సొంతం చేసుకున్నాడు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయిన రవి శాస్ర్తీ ఇంటర్వ్యూ నిర్వహించిన భారత క్రికెట్ సలహా మండలి (సిఎసి) సభ్యుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. తన ఇంటర్వ్యూ సమయంలో కమిటీలోని మరో ఇద్దరు సభ్యులు సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్ ఉన్నారని, గంగూలీ గైర్హాజరై తనను అవమానించాడని రవి శాస్ర్తీ ధ్వజమెత్తాడు. దీనిపై గంగూలీ స్పందిస్తూ, ఇంటర్వ్యూకు స్వయంగా హాజరుకాకుండా నెట్ ద్వారా పాల్గొనడమే అతని చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నదని విమర్శించాడు. తనను విమర్శించడం వెర్రితనమేనని వ్యాఖ్యానించాడు. ఈ మాటల యుద్ధం కొనసాగుతుండగా, కుంబ్లే చీఫ్‌గా వ్యవహరిస్తున్న కమిటీలో పత్రికా ప్రతినిధిగా ఉండడం కష్టమని రవి శాస్ర్తీ అనుకొని ఉంటాడని, అందుకే రాజీనామా చేశాడని బిసిసిఐ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఐసిసి క్రికెట్ కమిటీ చీఫ్‌గా కొనసాగేందుకు బిసిసిఐ కుంబ్లేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుంబ్లే పర్యవేక్షణలో తాను ఒక పదవిలో కొనసాగడం రవి శాస్ర్తీకి ఇష్టం లేదన్న వాదన వినిపిస్తున్నది. ఇనే్నళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా వివిధ పదవులను అనుభవించిన అతను హఠాత్తుగా ఎందుకు రాజీనామా చేశాడని పలువురు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద టీమిండియా చీఫ్ కోచ్ పదవి బిసిసిఐతోపాటు ఐసిసిలోనూ సమస్యలకు కారణమవుతోంది.