క్రీడాభూమి

హషీం ఆమ్లా, డ్వెయిన్ బ్రేవో రికార్డు భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూలై 2: షహీం ఆమ్లా, డ్వెయిన్ బ్రేవో టి-20 ఫార్మెట్‌లో ఐదో వికెట్‌కు కొత్త రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బార్బడాస్ ట్రైడెంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడిన వీరు ఐదో వికెట్‌కు 92 బంతుల్లో 150 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆమ్లా 54 బంతులు ఎదుర్కొని 81 పరుగులు చేయగా, బ్రేవో అజేయంగా 66 పరుగులు సాధించాడు. ట్రినిడాడ్ తొలుత బ్యాటింగ్ చేసి, 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు సాధించింది. దీనికి సమాధానంగా బార్బడాస్ ఎనిమిది వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2007లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఐదో వికెట్‌కు సాయిరాజ్ బహుతులే, యోగేష్ తకావాలే 149 పరుగులతో నెలకొల్పిన రికార్డును ఆమ్లా, డ్వెయిన్ బ్రేవో అధిగమించారు.
సంక్షిప్త స్కోర్లు
ట్రిన్బాగో నైట్ రైడర్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 (హషీం ఆమ్లా 81, డ్వెయిన్ బ్రేవో 66 నాటౌట్, అకెల్ హోసేన్ 2/18, రవి రాంపాల్ 2/33).
బార్బడాస్ ట్రైడెంట్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 (స్టీవెన్ టేలర్ 37, షోయబ్ మాలిక్ 28, నికోలస్ పురాంట్ 33, కీరన్ పోలార్డ్ 2/42, సునీల్ నారైన్ 2/21).

చిత్రం.. డ్వెయన్ బ్రేవో, హషీం ఆమ్లా