క్రీడాభూమి

మాటకు మాటే నా సమాధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: మాటకు మాట అనడమే స్లెడ్జింగ్‌కు తన సమాధానమని భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పష్టం చేశాడు. తనను హేళన చేసిన వారిని ఎవరినీ ఉపేక్షించనని అంటూ, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డారెన్ లీమన్‌ను ఒకసారి ‘నువ్వు గర్భిణివా’ అని అడిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. త్వరలోనే ప్రసారం కానున్న ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొన్న భజ్జీ స్లెడ్జింగ్‌పై పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. ఎక్కువగా ఆస్ట్రేలియా క్రికెటర్లే స్లెడ్జింగ్‌కు పాల్పడేవారని అన్నాడు. ఒకసారి తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో లీమన్ నన్ను వెక్కిరించాడని, తాను క్షణం కూడా ఆలోచించకుండా అతని బాన కడుపును చూపిస్తూ ‘నువ్వు గర్భిణివా’ అని అడిగానని చెప్పాడు. అక్కడే ఉన్న షేన్ వార్న్ కూడా తన మాటకు విరగబడి నవ్వాడని అన్నాడు. క్రికెటర్లకు అంత పెద్ద పొట్ట ఉండకూడదని వ్యాఖ్యానించాడు. అదే విధంగా ఆసీస్ మాజీ పేసర్ గ్లేన్ మెక్‌గ్రాత్ కూడా ఎక్కువగా స్లెడ్జింగ్‌కు పాల్పడేవాడని అన్నాడు. అతను ఒక మాట అంటే తాను ఐదు మాటలు అనేవాడినని భజ్జీ చెప్పాడు. మాటకు మాటనివ్వడానికి గమనించిన తర్వాత తనపై వ్యాఖ్యలు చేయడాన్ని మెక్‌గ్రాత్ మానుకున్నాడని చెప్పాడు. ఆస్ట్రేలియాకే చెందిన మరో ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌తో జరిగిన ఘర్షణ గురించి ప్రశ్నించగా, వాస్తవానికి తాను అతనిని ‘మంకీ’ (కోతి) అని తిట్టలేదని వివరణ ఇచ్చాడు. ‘తేరీ మాకీ.. హాత్‌కీ రోటీ ఖానేకో బడా దిల్ కర్ రహా హై’ (మీ అమ్మ చేతి రొట్టెను తినాలని మనసు కోరుతున్నది) అన్నట్టు భజ్జీ చెప్పాడు. కానీ ‘మాకీ’ అనే పదాన్ని అతను ‘మంకీ’గా అర్ధం చేసుకున్నాడని అన్నాడు. ‘అతనికి హిందీ రాదు.. నాకు ఇంగ్లీషు రాదు’ అని చమత్కరించాడు.
పాకిస్తాన్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌తో కూడా మైదానంలో తాను చాలాసార్లు మాటామాటా అనుకున్నట్టు భజ్జీ తెలిపాడు. తన బౌలింగ్‌లో సిక్స్ కొట్టాల్సిందిగా అక్తర్ తనను సవాలు చేశాడని, తాను సిక్స్ కొట్టడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడని అన్నాడు. ఆతర్వాత వరుసగా రెండు బౌన్సర్లను విసిరితే వాటిని తప్పించుకున్నానని అన్నాడు. మరోసారి అక్తర్ తనతో ఘర్షణ పడి ‘నీ గతికి వస్తా.. నిన్ను కొడతా’ అన్నాడని, తాను కూడా ఏమాత్రం తగ్గకుండా ‘వచ్చి చూడు.. ఎవరు ఎవరిని కొడతారో’ అని సమాధానం ఇచ్చానని చెప్పాడు. అయితే, అక్తర్ చాలా బలవంతుడని, అతను నిజంగానే తన గదికి వచ్చి ఎక్కడ కొడతాడోనని చాలాసేపు భయపడ్డానని అన్నాడు. మైదానంలోనే అక్తర్‌తో తనకు గొడవలు ఉండేవని, బయటకు వచ్చిన తర్వాత తాము మంచి స్నేహితులమని పేర్కొన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఆడుతున్నప్పుడు శ్రీశాంత్‌ను చెంప దెబ్బ కొట్టిన సంఘటనపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, తాను జీవితంలో చేసిన ఒకే ఒక పొరపాటు అదేనని అన్నాడు. ఆ సంఘటనకు చింతిస్తున్నట్టు తాను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పానని అన్నాడు. ఇప్పుడు కూడా బహిరంగ క్షమాపణ చెప్తున్నానని అన్నాడు. నిజానికి శ్రీశాంత్ తనకు అనుచితంగా ప్రవర్తించాడని, అనంతరం అతను మైదానంలో చాలా బిగ్గరగా ఏడవడాన్ని చూసిన వారంతా అతనిని తాను బలంగా కొట్టానని అనుకున్నారని చెప్పాడు. ఏదిఏమైనా తాను చెంపదెబ్బ కొట్టి ఉండాల్సింది కాదని అన్నాడు. కోచ్ అనిల్ కుంబ్లే సమర్థుడని అతని మార్గదర్శకంలో టీమిండియా ఉన్నత ప్రమాణాలను సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందని భజ్జీ అన్నాడు. వెస్టిండీస్ టూర్‌లో భారత్ విజయభేరి మోగిస్తుందని జోస్యం చెప్పాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుగా ఉంటాడని, ఆ లక్షణమే టీమిండియా ఎదుగుదలకు పునాది అవుతుందని చెప్పాడు.

చిత్రం.. హర్భజన్ సింగ్