క్రీడాభూమి

వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ జొకోవిచ్ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 2: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సిం గిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకో విచ్ పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించాడు. శామ్ క్వెర్రీతో తలపడిన జొకోవిచ్ మొదటి రెండు సెట్లను 6-7, 1-6 తేడాతో చేజార్చుకున్నాడు. అదే సమయంలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గిన తర్వాత తిరిగి ఆ మ్యాచ్‌ని కొనసాగించగా, మూడో సెట్‌ను జొకోవిచ్ 6-3 తేడాతో గెల్చుకున్నాడు. నాలుగో సెట్‌లో 5-6 తేడాతో వెనుకంజలో నిలవగా మరోసారి వర్షం కారణంగా ఆటను నిలిపేశారు. రెండు అవాంతరాల అనంతరం మళ్లీ మ్యాచ్ కొనసాగింది. ఆ సెట్‌ను అతను 6-7 తేడాతో కోల్పోయాడు. నిరుటి మాదిరిగానే అతను ఈసారి కూడా క్యాలండర్ శ్లామ్ ను సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అతనిపై విజయం సాధించిన క్వెర్రీ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారాడు. కాగా, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ 6-4, 6-2, 6-2 స్కోరుతో డానియెల్ ఇవాన్స్‌పై నెగ్గాడు. నిక్ కిర్గియోస్ 6-7, 6-1, 2-6, 6-4, 6-4 స్కోరుతో వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన డస్టిన్ బ్రౌన్‌పై విజయం సాధించాడు. ఇలావుంటే, షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన మ్యాచ్‌లను జరుపుతూనే సస్పెండైన మ్యాచ్‌లను సమయానుకూంగా నిర్వహించేందుకు వింబుల్డన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇలావుంటే ఈసారి వింబుల్డన్‌ను వర్షం వెంటాడుతుండగా, పలు మ్యాచ్‌లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ప్రీ క్వార్టర్స్ చేరుకుంది. మూడో రౌండ్‌లో క్రిస్టినా మెక్‌హాల్‌తో తలపడిన సెరెనా 6-7, 6-2, 6-4 తేడాతో విజయం సాధించి, టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. నాలుగో సీడ్ ఏంజెలిక్ కెర్బర్ 7-6, 6-1 ఆధిక్యంతో కరినా విటాఫ్‌పై గెలిచి ప్రీ క్వార్టర్స్ చేరింది. ఐదో సీడ్ సిమోనా హాలెప్ 6-4, 6-3 తేడాతో కికీ బెర్టెన్స్‌ను చిత్తుచేసింది. అంతకు ముందు, మాజీ చాంపియన్ వీనస్ విలియమ్స్ 7-5, 4-6, 10-8 తేడాతో డరియా కసట్కినాపై గెలిచింది.

చిత్రం.. వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి, మూడో రౌండ్‌లోనే ఓటమిపాలైన నొవాక్ జొకోవిచ్