క్రీడాభూమి

చెమటోడుస్తున్న టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 2: భారత క్రికెటర్లు నెట్స్‌లో శ్రమిస్తున్నారు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే భారత జట్టు ఇక్కడ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తున్నాడు. తాను స్వయంగా నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ, యువ బౌలర్లకు ప్రత్యక్ష శిక్షణ ఇస్తున్నాడు. పరి మిత ఓవర్ల ఫార్మెట్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీని, భారత్ ‘ఎ’ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను సంప్రదించి వారి సలహాలు స్వీకరించనున్నాడు. విండీస్ టూర్ లో అనుసరించాల్సిన వ్యూహాలను రచించడంలో అతను నిమ గ్నమయ్యాడు. ఎక్కువ మంది యువ ఆటగాళ్లతో కూడిన భార త జట్టుకు కుంబ్లే కోచింగ్ ఎంతో ఉపయోగపడుతుందని పలు వురు సీనియర్ క్రికెటర్లు అంటున్నారు. వారి అంచనాలకు తగిన ట్టుగా రాణించేందుకు కుంబ్లే కూడా ప్రయత్నిస్తున్నాడు. స్వయం గా పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన బౌలర్ కావడంతో అతను మొద ట తన దృష్టిని బౌలింగ్ విభాగంపై కేంద్రీకరించాడు.
విజయమే కుంబ్లే లక్ష్యం: స్టువర్ట్ బిన్నీ
సాంకేతికపరమైన అంశాలకంటే, విజయాలు సాధించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కుంబ్లే చెప్పాడని భారత యువ ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ చెప్పాడు. మ్యాచ్‌లో విజయమే అతని లక్ష్యమ ని, అందు కోసం నిరంతరం శ్రమిస్తునే ఉంటాడని శనివారం విలేఖరు లతో మాట్లాడుతూ బిన్నీ చెప్పాడు. నెట్స్‌లో కూడా అతను టెక్నికల్ అం శాలకంటే, ఏ విధంగా ఆడితే గెలుస్తామన్న విషయంపైనే దృష్టి కేంద్రీకరించాడని అన్నా డు. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మాట్లాడుతూ జట్టుకు డైరెక్టర్‌గా, తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించిన రవి శాస్ర్తి, కుంబ్లే అనుసరిస్తున్న విధానాల్లో పెద్దగా తేడా లేదని అన్నాడు. ఇద్దరూ జట్టుకు ఉత్తమ సేవలు అందించాలని కోరుకునే వారేనని అన్నాడు.
రివర్స్ స్వింగ్‌పై దృష్టి; ధావన్
రివర్స్ స్వింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవడంపైనే దృష్టి కేంద్రీకరించినట్టు భారత ఓపెన ర్ శిఖర్ ధావన్ అన్నాడు. వెస్టిండీస్‌లో పిచ్‌లు స్వింగ్ బౌలింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉంటాయని శనివారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. విండీస్ పిచ్‌లు తన బ్యాటింగ్‌కు తగినట్టు ఉంటాయన్నాడు. ఇలావుంటే, వేగంగా దూసుకొచ్చే బంతులను అంతే వేగంగా బాదే అలవాటున్న ధావన్ బ్యాటింగ్ విధానానికి స్పిన్ ట్రాక్ ఏమాత్రం అనువుగా ఉండదు. ఫాస్ట్ ట్రాక్స్‌పై అతను రాణిస్తాడని విశే్లషకుల అభిప్రాయం. కానీ, ఇటీవల కాలంలో అతను అనుకున్న స్థాయలో రాణించలేకపోతున్నాడు. మొదటి టెస్టు జరిగిన మొహాలీలోనే అతను కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడి, 187 పరుగులు సాధించిన అతను కృష్ణమాచారి శ్రీకాంత్ తర్వాత ఆ స్థాయలో ఆడగల ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అదే తరహాలోనే అతను పలు మ్యాచ్‌లు ఆడాడు. కానీ, ఇటీవల అతను పలు మ్యాచ్‌ల్లో చేతులెత్తేయడం ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన పెంచుతున్నది. గంటకు సుమారు 140 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో బంతులు దూసుకొస్తున్న పిచ్‌లపై ఆడేందుకు తాను ఇష్టపడతానని గతంలో పలు సందర్భాల్లో ధావన్ ప్రకటించాడు. బంతి విపరీతంగా బౌన్స్ అవుతున్న వికెట్‌పై బ్యాటింగ్‌ను కొనసాగించడాన్ని సవాలుగా స్వీకరిస్తానని చెప్పాడు. పేసర్లు ఎంత వేగంగా బంతులు వేస్తే, వాటిని అంత వేగంగా ఆడేందుకు ప్రయత్నించడంలో ఆనందం ఉంటుందని చెప్పాడు. అయతే, ఆ స్థాయలో అతను ఆడడం లేదు. దక్షిణాఫ్రికాతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన అతను తీరా మ్యాచ్‌లు ఆరంభమైన తర్వాత విఫలమవుతున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన కారణంగానే అతను స్వింగ్ బౌలింగ్‌పై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించాడు.