క్రీడాభూమి

బోల్ట్‌కు ఫిట్నెస్ సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్, జూలై 2: జమైకా స్ప్రింట్ వీరుడు ఉసేన్ బోల్ట్‌ను ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా కాలి కండరాలు బెణకడంతో అతను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బోల్ట్ జమైకా నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు జరుగుతున్న ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. ఈ రెండు విభాగాల్లోనూ ఫైనల్ చేరాడు. అయితే, వంద మీటర్ల పరుగును పూర్తి చేయలేకపోయాడు. కండరాల నొప్పితో బాధపడుతూ రేస్‌ను పూర్తి చేయలేకపోయాడు. మొదటి రౌండ్ రేసులోనే కాలి నొప్పి వేధించిందని, సెమీ ఫైనల్ చేరే సరికి తీవ్ర స్థాయికి చేరిందని బోల్ట్ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. వైద్యులు పరీక్షించి కండరాలు చిట్లినట్టు నిర్ధారించారని తెలిపాడు. అయితే, ఇది చాలా చిన్న సమస్యేనని, రియో ఒలింపిక్స్ ఆరంభమయ్యేలోగా పూర్తిగా కోలుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. నిరుడు చాలాకాలం వెన్నునొప్పితో బాధపడిన బోల్ట్ కొన్ని ఈవెంట్స్‌కు గైర్హాజరయ్యాడు. అంతకు ముందు చాలా కాలం నుంచి బాధిస్తున్న వెన్నునొప్పి ఒకానొక దశలో అతని కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టింది. అయితే, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, వైద్య నిపుణుల పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న బోల్ట్ ఆ సమస్యను అధిగమించినట్టు ప్రకటించాడు. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా శ్రమిస్తున్నాడు.
రియోకు వెళ్లడం సాధ్యమా?
బోల్ట్ రియో కలలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోలేదు. అతను ఒలింపిక్స్‌లో పాల్గొనడం అసాధ్యమేమీ కాదని జమైకా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి పోటీపడే వారంతా ముందుగా జరిగే ట్రయల్స్‌లో సత్తా చాటాలి. అందులో రాణిస్తేనే ఒలింపిక్స్‌కు క్వాలిఫై అవుతారు. అయితే, ఎవరైనా ఫిట్నెస్ సమస్యల కారణంగా ట్రయల్స్‌కు హాజరుకాలేకపోయినా లేదా మధ్యలోనే విరమించినా, అలాంటి వారిని ఒలింపిక్స్‌కు ఎంపిక చేసే అధికారం జమైకా ప్రభుత్వానికి ఉంది. కానీ వారు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు బయలుదేరడానికి ముందే ఫిట్నెస్‌ను నిరూపించుకోవాలి. కాబట్టి ట్రయల్స్‌లో సంబంధం లేకుండా బోల్ట్‌కు 100, 200 మీటర్ల పరుగుతోపాటు 400 మీటర్ల రిలే జట్టులోనూ స్థానం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం బోల్ట్ ఎదుర్కొంటున్నది గ్రేడ్-1 గాయమే కాబట్టి వారం పది రోజుల్లో అతను పూర్తిగా కోలుకోవచ్చు. కండరాలు ఒత్తిడికి గురికావడం లేదా బెణకడాన్ని గ్రేడ్-1 గాయంగా పేర్కొంటారు. అథ్లెట్లలో ఇది చాలా సామాన్యమైన సమస్య. బోల్ట్ కొద్ది రోజుల్లోనే కోలుకుంటాడని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
వెన్నునొప్పి సంగతేమిటి?
కండరాలు బెణకడం చాలా చిన్న సమస్యే కాబట్టి బోల్ట్ కెరీర్‌కు వచ్చిన సమస్య ఏమీ లేదు. అయితే, చాలాకాలంగా వేధిస్తున్న వెన్నునొప్పే అతని కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేలా కనిపిస్తున్నది. అథ్లెట్లకు, ప్రత్యేకించి షార్ట్ డిస్టెన్స్ రన్నర్లకు ఫిట్నెస్ ప్రమాణాలు అసాధారణ స్థాయిలో ఉండాలి. ఏ చిన్న సమస్య ఎదురైనా వారి కెరీర్‌కు తెరపడుతుంది. గత కొద్దికాలంగా వెన్నునొప్పి వేధిస్తున్నదని బోల్ట్ స్వయంగా పేర్కొన్నాడు. దానిని అధిగమించానని ప్రకటించినప్పటికీ, వెన్నునొప్పి లాంటి సమస్యలు ఒకసారి వస్తే, పూర్తిగా నయం కావడం కష్టమని నిపుణులు అంటున్నారు. ఈ కోణంలో చూస్తే బోల్ట్ కెరీర్‌కు అదే పెద్ద అడ్డంకిగా పరిణమించనుంది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొని, పతకాలను సాధిస్తే అతను ఫిట్నెస్ సమస్యల నుంచి బయటపడినట్టే అనుకోవాలి. కానీ, అది అనుకున్నంత సులభంగా కనిపించడం లేదు. రియో ఒలింపిక్స్‌లో మరోసారి స త్తా చాటతాడని అనుకున్న బోల్ట్ గాయపడడం అభిమానులను ఆందోళకు గురి చేస్తున్నది.