క్రీడాభూమి

రియోకు సిద్ధమవుతున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 23: వచ్చే ఏడాది రియోలో జరిగే ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నానని భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ అన్నాడు. ఇప్పటి వరకూ ఆరు ఒలింపిక్స్‌లో పాల్గొన్న అనుభవం ఉందని, కాబట్టి ఫిట్నెస్‌ను ఏ విధంగా నిలబెట్టుకోవాలో అనే విషయంపై తనకు స్పష్టత ఉందని ఐడిబిఎ ఫెడరల్ కోల్‌కతా మారథాన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పాడు. ఒలింపిక్స్‌లో ఆడడం ఎప్పుడూ ఆనందాన్నిస్తుందని అన్నాడు. పతకం సాధిస్తానన్న నమ్మకం తనకు ఉందని చెప్పాడు.