క్రీడాభూమి

మళ్లీ ఓడిన టైటాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: ప్రో కబడ్డీలో తెలుగు టైటాన్స్ మరోసారి ఓటమిపాలైంది. ఒక్క మ్యాచ్‌ని కూడా గెల్చుకోలేక అభిమానులను నిరాశ పరచిన టైటాన్స్ సొంత గడ్డపై ఆదివారం పాట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అందరి అంచనాల మేరకే ఆటగాళ్లు చివరి వరకూ పోరాడారు. కానీ, అంతకు ముందు మ్యాచ్‌ల మాదిరిగానే చివర్లో తీవ్రమైన ఒత్తిడికి గురై, మ్యాచ్‌ని 33-35 తేడాతో చేజార్చుకున్నారు. టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరీ అసాధారణ ప్రతిభ కనబరచి 11 పాయింట్లు సంపాదించాడు. సందీప్ నర్వాల్ ఐదు, వినోద్ నాలుగు చొప్పున పాయింట్లు రాబట్టారు. పాట్నా ఆటగాళ్లలో ప్రదీప్ నర్వాల్ 11 పాయింట్లు చేశాడు. రాజేష్ మోండల్ 7 పాయింట్లతో రాణించాడు. కుల్దీప్ సింగ్ ఐదు పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌తో తలపడిన యు ముంబా జట్టు 8 పాయంట్ల తేడాతో గెలిచింది. ఈ జట్టు 26 పాయంట్లు సాధించగా, బెంగాల్ వారి యర్స్ 18 పాయంట్లకు పరిమితమైంది. యు ముంబా తరఫున రిషాంక్ దేవాడిగ ఐదు పాయంట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాకేష్ కుమార్, సుర్జీత్ చెరి నాలుయు పా యంట్లు సంపాదించారు. సమష్టిగా కృషి చేస్తే విజయం సాధించడం కష్టం కాదని యు ముంబా నిరూపిస్తే, బెంగాల్ జట్టు అందుకు భిన్నంగా ఆడింది. గిరీష్ మారుతి మూడు పాయంట్లు చేశాడు. అతనే ఆ జట్టు టాప్ స్కోరర్.

చిత్రం.. తెలుగు టైటాన్స్, పాట్నా పైరేట్స్ ప్రో కబడ్డీ మ్యాచ్‌లో ఓ దృశ్యం