క్రీడాభూమి

షూటౌట్‌లో జర్మనీ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోర్డాక్స్, జూలై 3: యూరో 2016లో పెనాల్టీ షూటౌట్ల పర్వం కొనసాగుతున్నది. క్వార్టర్ ఫైనల్స్‌లో జర్మనీ, ఇటలీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ షూటౌట్ అనివార్యమైంది. జొనాస్ హెక్టర్ చేసిన కీలక గోల్‌తో జర్మనీ 6-5 తేడాతో గెలుపొందగా, ఇటలీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి టోర్నీలో జరిగిన చాలా మ్యాచ్‌ల మాదిరిగానే జర్మనీ, ఇటలీ మధ్య క్వార్టర్ ఫైనల్ పోరు ఏ మాత్రం ఆసక్తిని రేపలేకపోయింది. ఇరు జట్లు మితిమీరిన రక్షణాత్మక విధానాన్ని అనుసరించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడంతో, ప్రథమార్ధంలో గోల్స్ నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో ఇరు జట్లు దాడులకు దిగుతాయని ఊహించినప్పటికీ అందుకు భిన్నంగా ఆట కొనసాగడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. ఎట్టకేలకు 65వ నిమిషంలో జర్మనీ ఆటగాడు మెసట్ ఒజిల్ గోల్ చేసి, మ్యాచ్‌కి ఊపిరి పోశాడు. ఈ గోల్ లభించిన 13 నిమిషాల్లోనే ఇటలీకి లియోనార్డో బొనస్సీ ఈక్వెలైజర్‌ను అందించాడు. స్కోర్లు సమమైన వెంటనే ఇరు జట్లు తిరిగి డిఫెన్స్‌కు పరిమితమయ్యాయి. నిర్ణీత సమయం ముగిసే సరికి స్కోరు 1-1గా ఉండడంతో ఎక్‌స్ట్రా టైమ్‌ను కేటాయించారు. కానీ, అదనపు సమయంలోనే గోల్స్ నమోదుకాలేదు. దీనితో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్‌లో ఇటలీ ఐదు గోల్స్ చేయగా, జర్మనీ ఆరు గోల్స్ సాధించి సెమీఫైనల్ చేరింది.
ఉత్కంఠ రేపిన షూటౌట్
పెనాల్టీ షూటౌట్ ఉత్కంఠ రేపింది. మొదట ఇటలీ ఆటగాడు లారెన్జో ఇన్సినే తన ప్రయత్నంలో సఫలంకాగా, జర్మనీకి టోనీ క్రూస్ గోల్‌ను అందించాడు. రెండో ప్రయత్నంలో ఇటలీ ఆటగాడు సిమోన్ జజా, జర్మనీ ఆటగాడు థామస్ ముల్లర్ విఫలమయ్యారు. మూడో ప్రయత్నంలో ఆండ్రి బార్జాగ్లీ గోల్ చేయగా, జర్మనీ తరఫున షాట్ తీసుకున్న మెసట్ ఒజిల్ గోల్ చేయలేకపోయాడు. దీనితో ఇటలీ 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. నాలుగో షూట్‌ను క్రాజియానో పిల్లే గోల్‌గా మలచలేకపోడు. జర్మనీ ఆటగాడు జూలియన్ డ్రాక్స్‌లర్ గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోర్లు 2-2గా సమమయ్యాయి. ఐదో ఛాన్స్‌ను తీసుకున్న లియోనార్డో బొనుసీ (ఇటలీ), బాస్టియన్ స్వాన్‌స్టెగర్ (జర్మనీ) గోల్స్ చేయలేకపోయారు. ఫలితంగా ఇరు జట్ల గోల్స్‌లో తేడా రాలేదు. ఆరు, ఏడు, ఎనిమిది ప్రయత్నాల్లో వరుసగా ఇటలీ తరఫున ఇమాన్యుయెల్ గియాచెరిని, మార్కో పారొలో, మథియా డి సిగ్లియో, జర్మనీ తరఫున మాట్స్ హమ్మల్స్, జాషువా కిమిచ్, జెరోమ్ బొటెంగ్ గోల్స్ సాధించి, స్కోరును 5-5గా నిలబెట్టారు. ఇటలీ ఆటగాడు మాటియో డార్మియన్ తన ప్రయత్నంలో విఫలంకాగా, ఆ వెంటనే జర్మనీ ఆటగాడు జొనాస్ హెక్టర్ గోల్ చేశాడు. అతను సాధించిన గోల్‌తో జర్మనీ 6-5 ఆధిక్యానికి దూసుకెళ్లి, విజయభేరి మోగించింది.

చిత్రం.. పెనాల్టీ షూటౌట్‌లో ఇటలీపై నెగ్గిన జర్మనీ క్రీడాకారుల ఆనందం