క్రీడాభూమి

ముర్రే ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 3: ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్‌లోనే అనూహ్యంగా ఓటమిపాలై నిష్క్రమించగా, టైటిల్ సాధించే అవకాశాలను మెరుగుపరచుకున్న బ్రిటన్ వీరుడు, రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే ప్రీ క్వార్టర్స్ చేరాడు. మూడో రౌండ్‌లో అతను ఆస్ట్రేలియాకు చెందిన జాన్ మిల్మన్‌ను 6-3, 7-5, 6-2 తేడాతో ఓడించి ముందంజ వేశాడు. జొకోవిచ్‌తో గత 15 మ్యాచ్‌ల్లో పరాజయాలను చవిచూసిన ముర్రేకు ఈసారి వింబుల్టన్‌లో అతని నుంచి పోటీ లేకపోవడం కొత్త ఉత్సాహాన్నిస్తున్నది. నాలుగో సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కా కూడా ఓటమిపాలు కావడం ముర్రే విజయావకాశాలను మరింత పెంచింది. ముందుగా ఊహించిన విధంగా ఫలితాలు వెల్లడై ఉంటే, సెమీ ఫైనల్స్‌లో వావ్రిన్కాను ముర్రే ఢీకొనాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రమాదం తప్పింది. అయితే, జొకోవిచ్ నిష్క్రమణతో టైటిల్ సాధించే అవకాశాలు మెరుగుపడ్డాయన్న అభిప్రాయాన్ని ముర్రే ఖండించాడు. టైటిల్ కోసం ఇంకా చాలా మ్యాచ్‌లే ఆడాలని వ్యాఖ్యానించాడు. జొకోవిచ్ ఓటమిని తాను ఊహించలేదని చెప్పాడు. ఎంతో నిలకడగా రాణించే ఆటగాళ్లలో జొకోవిచ్ ఒకడని అన్నాడు. అయితే, ప్రతి మ్యాచ్‌నీ గెల్చుకోవడం ఎవరికి సాధ్యం కాదని వ్యాఖ్యానించాడు.
పురుషుల సింగిల్స్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో డేవిడ్ గోఫిన్ 6-4, 6-3, 2-6, 6-1 తేడాతో డెనిస్ ఇస్టామిన్‌ను ఓడించి ప్రీ క్వార్టర్స్ చేరాడు. మహిళల సింగిల్స్‌లో అగ్నీస్కా రద్వాన్‌స్కా 6-3, 6-1 ఆధిక్యంతో కాతెరినా సిన్లకొవాపై గెలిచి ప్రీ క్వార్టర్స్ చేరింది. డొమినికా సిబుల్కొవా 6-4, 6-3 ఆధిక్యంతో యూగెనీ బుచార్డ్‌పై గెలిచింది. ఎకతరీన మకరోవా 7-5, 7-6 స్కోరుతో విజయం సాధించి పెట్రా క్విటోవాను ఇంటిదారి పట్టించింది.

చిత్రం.. వింబుల్డన్‌లో ప్రీక్వార్టర్స్ చేరిన ఆండీ ముర్రే