క్రీడాభూమి

కోహ్లీ దూకుడును అడ్డుకోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 4: టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుకు తాను కళ్లెం వేయనని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. అయితే, భారత దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నామన్న విషయాన్ని ఆటగాళ్లంతా గుర్తుంచుకోవాలని, గీత దాటకూడదని కుంబ్లే హితవు పలికాడు. భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ టూర్‌కు బయలుదేరడానికి ముందు ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మైదానంలోకి దిగిన తర్వాత ఆటగాళ్లు దూకుడుగా వ్యవహరించడాన్ని తాను ఇష్టపడతానని అన్నాడు. క్రికెట్ ఆడే రోజుల్లో తాను కూడా అదే విధంగా ఉండేవాడినని చెప్పాడు. అయితే, అప్పటికీ, ఇప్పటికీ ఆటగాళ్లు మైదానంలో వ్యవహరించే విధానంలో చాలా మార్పులు ఉన్నాయని అన్నాడు. కోహ్లీ దూకుడుకు తాను కళ్లెం వేయబోనని అన్నాడు. ఒక వ్యక్తి సహజసిద్ధమైన స్వభావాన్ని అడ్డుకోవాలన్న ఆలోచన తనకు ఎంతమాత్రం లేదని చెప్పాడు. అయితే, భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్నామనే విషయాన్ని జట్టులో ఎవరూ మరచిపోకూడదని అన్నాడు. దూకుడుగా వ్యవహరించడానికి, ఘర్షణ పడడానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని సూచించాడు. ఈ విషయాన్ని ఆటగాళ్లందరికీ తెలుసుననే అనుకుంటున్నానని కుంబ్లే చెప్పాడు.
వెస్టిండీస్‌తో జరిగే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఎలాంటి ఫలితాన్ని కోరుకుంటున్నారని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ, విజయాలు సాధించాలనే అనుకుంటున్నట్టు చెప్పాడు. ఏ జట్టూ అందుకు భిన్నంగా ఆలోచించదని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్లందరినీ సిద్ధం చేయడం, వారి శక్తిసామర్థ్యాలను గుర్తించి, అందుకు తగిన బాధ్యతలు అప్పచెప్పడం, సరైన సమయాల్లో సరైన వ్యూహాలను రచించడం వంటివి కోచ్‌గా తన బాధ్యతలని చెప్పాడు. వెస్టిండీస్‌తో మొదలై, ఆతర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో టీమిండియా మొత్తం 17 టెస్టులు ఆడుతుందని చెప్పాడు. నిలకడగా ఆడడం, విజయాలు సాధించడమే తమ లక్ష్యాలని పేర్కొన్నాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కుడి చేతికి గాయమైన విషయాన్ని ప్రస్తావించగా, అది పెద్ద దెబ్బ కాదని కుంబ్లే అన్నాడు. త్వరలోనే తగ్గిపోతుందని, అతను పూర్తి ఫిట్నెస్‌తో టూర్‌లో పాల్గొంటాడని ధీమా వ్యక్తం చేశాడు.